ఉద్యోగ నియామకాలలో ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు విద్యుత్ శాఖ మంత్రి

0
277
Spread the love

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాలలో ఎటువంటి ఆటంకాలు ఉండబోవని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. 317 జీవో తెచ్చిందే తెలంగాణా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసమని ఆయన తెలిపారు. అందులో లబ్ది పొందేది నిరుద్యోగ యువతీ, యువకులు అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి తల్లి దివంగత గుంటకండ్ల సావిత్రమ్మ స్మారకార్థం కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన యస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువతీ, యువకులకు శుక్రవారం రోజున ఆయన శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు.గత కొద్ది కాలంగా పోలీస్ కానిస్టేబుల్స్ తో పాటు వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు సూర్యాపేట కేంద్రంగా యస్ ఫౌండేషన్ మెటీరియల్ తో సహా అందించి అన్ని వసతులతో సహా శిక్షణ ను అందిస్తున్న విషయం తెల్సిందే.

అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉద్యోగాల పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి యస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా పోటీ పరీక్షలకు హాజరు కాగోరు 1700 మందికి పై చిలుకు యువతీ, యువకులు ఈ శిక్షణా తరగతులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే యస్ ఫౌండేషన్ నిర్వాహకులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ భవనం లో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా తరగతులను శుక్రవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీళ్లు ,నిధులు, నియామకాలు అన్న ట్యాగ్ లైన్ తో మొదలు పెట్టిన రాష్ట్ర సాధనలో ప్రస్తుతం నియామకాలు జరుగుతున్నాయన్నారు.విద్యతో ఉన్నత స్థానాలు అధిరోహించ వచ్చని అటువంటి వారికి యస్ ఫౌండేషన్ బాసటగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆ క్రమంలోనే ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నియామకాల కోసం జరుగుతున్న పోటీ పరీక్షలకు హాజరు కాగోరు అభ్యర్థులు యస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా తరగతులను వినియోగించుకుని ఉన్నత అవకాశాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here