బండి సంజయ్ పై మరోసారి మండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి

0
29
Spread the love

బిజెపి నేత బండి సంజయ్ పై మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో బిజెపి ఆడుతున్న నాటకాన్ని కట్టి పెట్టాలంటూ ఆయనకు మంత్రి జగదీష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నాటు పెట్టాలా వద్దా అన్నది ఫిబ్రవరిలో కాదు ఇప్పుడే తేల్చిచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ధాన్యం కొనుగోళ్ల విషయం పై బిజెపి రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ప్రకటనలపై మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్,కంచర్ల భూపాల్ రెడ్డి,మెతుకు ఆనంద్,మాజీ శాసనమండలి సభ్యులు శ్రీనివాస రెడ్డి లతో కలసి తెలంగాణా భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణా రైతాంగాన్ని మరోసారి మోసం చేసేందుకు బిజెపి కుట్రలు పన్నిందంటూ ఆయన బండి పై నిప్పులు చెరిగారు.ఫార్మ్ హౌస్ కాదు ఫార్మర్ హౌస్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ముమ్మాటికీ ఫార్మరే నంటూ ఆయన చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలో నైనా ఆరు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా అంటూ ఆయన నిలదీశారు. యావత్ భారతదేశంలో ఒక్క తెలంగాణా రాష్ట్రంలోనే ఆరు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని అది ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత అని ఆయన పేర్కొన్నారు. దేశ రైతాంగం కేంద్రం మెడలు వంచి క్షమాపణలు చెప్పించిందని ఇటువంటి బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ మంత్రి జగదీష్ రెడ్డి బిజెపి నేత బండికి వార్నింగ్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here