ఈ-పరిపాలనపై ఏర్పాటైన జాతీయ సదస్సును ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్

0
32
Spread the love

హైదరాబాద్ లో ఈ-పరిపాలనపై ఏర్పాటైన 24వ జాతీయ సదస్సును ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్


హైదరాబాద్, జనవరి 7, 2022 – ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో డిజిటల్ విప్లవం ప్రారంభం అయ్యిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక (సహాయ), భూగర్భ శాస్త్రం, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్లు, అణు శాస్త్రం, అంతరిక్ష మంత్రిత్వ (స్వతంత్ర) శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ-పరిపాలనపై ఏర్పాటైన 24వ జాతీయ సదస్సును డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. రెండు రోజులపాటు సదస్సు జరగనున్నది. సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన డాక్టర్ జితేంద్ర సింగ్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ డేటా పవర్ హౌస్ గా భారతదేశం అవతరించిందని అన్నారు. చట్టపరమైన చర్యలు, ఇతర మార్గాల ద్వారా సమాచార గోప్యత పరిరక్షణకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు అమలు చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.

‘మహమ్మారి తర్వాత నెలకొన్న పరిస్థితిలో డిజిటల్ పరిపాలన: భారతదేశంలో పరిస్థితి’ ఇతివృత్తంగా హైదరాబాద్ (తెలంగాణ)లో ఈ-పరిపాలనపై 24వ జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి డిజిటల్ విధానం దేశం ప్రజలకు జీవన సౌలభ్యాన్ని అందించిందని అన్నారు. దీనివల్ల దేశంలో పేదలకు, అవసరంలో ఉన్న అనేక లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, జనన ధృవీకరణ పత్రం లేదా విద్యుత్ బిల్లు చెల్లింపు, నీటి బిల్లు లేదా ఆదాయపు పన్ను రిటర్న్‌ లను ఇప్పుడు డిజిటల్ ఇండియా ప్లాట్‌ ఫారమ్ ద్వారా వేగంగా మరియు సులభంగా జరుగుతున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఈ సేవలను సర్వీస్ కేంద్రాల ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు.

టెకేడ్ అంశాన్ని ప్రస్తావించిన డాక్టర్ జితేంద్ర సింగ్ దీనిపై ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను వివరించారు “ఈ దశాబ్దం డిజిటల్ టెక్నాలజీలో భారతదేశ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే అగ్ర నిపుణులు ఈ దశాబ్దాన్ని ‘ఇండియాస్ టెకేడ్’గా చూస్తున్నారు. అని నరేంద్ర మోదీ అన్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.

ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ ద్వారా నగదు రహిత, కాగితాలతో వ్యక్తులతో సంబంధం లేకుండా సేవలు అందించడంలో ప్రభుత్వాలు అనేక విజయవంతమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. డిబిటి, పిడిఎస్, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ, ఎల్‌పిజి మరియు పెన్షన్‌లను, సబ్సిడీ పంపిణీ ఆధార్ తో అనుసంధానించి సాధించిన ప్రయోజనాలు ఈ వ్యవస్థ సాధించిన విజయాలకు నిదర్శనాలు అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇ-
డిజిటల్ పరిపాలనలో తెలంగాణ సాధించిన ప్రగతిని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. పరిశ్రమలు, వాణిజ్యం సుపరిపాలన తో పాటు సామాజిక సంక్షేమం, అభివృద్ధి సుపరిపాలన కోసం టెక్నాలజీని ఉపయోగిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2021లో గుర్తింపు పొందాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జనహిత’ వేదిక ఫిర్యాదుల పరిష్కారం కోసం భారతదేశంలో పని చేస్తున్న అత్యుత్తమ వేదికల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని మంత్రి అన్నారు.

సదస్సులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి శ్రీ కె.టి. రామారావు రాష్ట్రంలో ఈ సేవల వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో డిజిటల్ విధానంలో పనిచేసే ఈ-వాలెట్ ను 2017 జూన్ నెలలో ప్రారంభించామని శ్రీ రామారావు తెలిపారు. ప్రజలకు సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు మీ-సేవ కేంద్రాలు పని చేస్తున్నాయని అన్నారు. ఇటీవల డ్రోన్ల ద్వారా ఔషధ సరఫరా కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన తెలిపారు.

ఈ సదస్సును పరిపాలన, సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here