తెలంగాణ లో దేవాలయాలకు పూర్వ వైభవం – మంత్రి కొప్పుల

0
249
Spread the love

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో.. శ్రీ పెద్దమ్మ నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన చేసిన మంత్రి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాతే, సీఎం కేసిఆర్ అధ్వర్యంలో దేవాలయాలకు పూర్వవైభవం వస్తున్నదని, తెలంగాణ ప్రభుత్వ హయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలు అభివృద్ది చెందుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు.
ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో గురువారం భూమి పూజ, శంకుస్థాపన చేశారు.
అభివృద్ధి, సంక్షేమాలతో పాటు, దేవాలయాల పునరుద్ధరణ కు కూడా సీఎం పెద్ద పీట వేశారన్నారు. అంతేగాక, వెయ్యి కోట్లతో శ్రీ యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయాన్ని యాదాద్రి గా అభివృద్ధి పరిచినట్లు చెప్పారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి పారవశ్యం పొంగి పొరలే విధంగా సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి వివరించారు.

ఈ కార్యక్రమంలో DCMS ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ZPTC లు బత్తిని అరుణ, బాదినేని రాజేందర్, MPTC లు MPP చిట్టి బాబు, మార్కెట్ వైస్ ఛైర్మన్ సునీల్,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here