నిరుపేదలకు ఆపన్న హస్తం నెరవేరిన అనాధ పిల్లల ఆకాంక్ష

0
137
Spread the love

*గృహప్రవేశం చేయించిన మంత్రి కోప్పుల ఈశ్వర్*

ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అనాధ పిల్లలు మామిడాల శ్రీకాంత్(21), మామిడాల శీరిష(18)లు, నిలువనీడ లేక అనారోగ్యంతో బాధపడుతున్న వృద్దురాలైన వాళ్ల మేనత్త వద్ద జీవిస్తున్నారు అని తెలుసుకోని వారికి ప్రభుత్వం నుంచి నివాస స్థలం(125 గజాలు) మంజూరు చేయించి, స్వంత ఖర్చులతో LM కొప్పుల ఛారిటీ ట్రస్టు ద్వారా నూతన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి శుక్రవారం రాష్ట్ర మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారి చేతుల మీదుగా వారికి గృహ ప్రవేశం చేయటం జరిగింది. సందర్భంగా వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారి కళను సాకారం చేసిన మంత్రి గారికి మరియు ట్రస్ట్ ఛైర్ పర్సన్ కొప్పుల స్నేహలత గారికి శ్రీకాంత్, శీరిషలు మరియు గ్రామ ప్రజలు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో DCMS ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి గారు, జడ్పీటీసీ లు బత్తిని అరుణ గారు, బాదినేని రాజేందర్ గారు, MPTC సత్తయ్య గారు, వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ అయ్యోరి రాజేష్ గారు, మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here