ఉమ్మడి ప్రవేశపరీక్ష ఫలితాలను విడుదల చేసిన మంత్రి కొప్పుల

0
152
Spread the love

ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీలలో ప్రవేశాలకై నిర్వహించిన ఉమ్మడి ప్రవేశపరీక్ష ఫలితాలను విడుదల చేసిన మంత్రి కొప్పులఈశ్వర్
-రాష్ట్రంలో ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజీలు 30,ఎస్టీ మహిళా డిగ్రీ కాలేజీలు 15,ఎస్టీ బాలుర డిగ్రీ కాలేజీలు 7, మొత్తం 52 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి.
-వీటిలో ప్రవేశాల కోసం ఇటీవల ఉమ్మడి ప్రవేశ పరీక్ష ( TGUGCET-2022) నిర్వహించారు.
-ఇందుకు సంబంధించిన ఫలితాలను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పులఈశ్వర్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.
-ఈ ప్రవేశ పరీక్షకు 18,498 మంది అమ్మాయిలు హాజరు కాగా,14,201 మంది (85% ),2,495 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు.
-ఇందులో అర్చన అనే అమ్మాయి మొదటి ర్యాంకు సాధించారు.
-ఈ పరీక్షలో అర్చనతో పాటు ఉత్తీర్ణత సాధించిన వారందరిని మంత్రి కొప్పులఈశ్వర్,ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ లు హృదయపూర్వకంగా అభినందించారు,తమ ఆశీస్సులు అందజేశారు.
*ఎస్సీ గురుకులాలకు సంబంధించిన ఫలితాలు, www.tswreis.ac.in,ఎస్టీ గురుకులాలకు సంబంధించిన ఫలితాలను https://tgtwgurukulam.Telangana.gov.in వెబ్ సైట్స్ ద్వారా పొందవచ్చని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు హన్మంతు నాయక్,ఎం.ప్రవీణ్,ప్రమోద్ కుమార్,శర్మలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here