అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేసిన మంత్రి కే.టీ.ఆర్

0
154
Spread the love

రూ. 61 కోట్ల అంచనా వ్యయంతో నాలా అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేసిన మంత్రి కే.టీ.ఆర్

కంటోన్మెంట్ అభిరుద్దికి కేంద్రం రాజకీయం చేయవద్దు : మంత్రి కేటీఆర్


హైదరాబాద్, ఫిబ్రవరి 12: 
  కంటోన్మెంట్ అభిరుద్దికి కేంద్రం రాజకీయం చేయవద్దని, అభివృద్ధికి సహకరించాలని రాష్ట్రం వచ్చినప్పటి నుండి విజ్ఞప్తి  చేస్తున్నాం కానీ కేంద్రం  మనస్సులో  ఏదో  పెట్టుకుని  రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర  పురపాలక, పట్టణాభివృద్ధి,  ఐటీ,  పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రూ. 61 కోట్ల అంచనా వ్యయంతో  సనత్ నగర్, కంటోన్మెంట్ , కూకట్ పల్లి నియోజకవర్గాల పరిధిలో చేపట్టే నాలా అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. 
ఈ సందర్భంగా  మంత్రి కే టి ఆర్ మాట్లాడుతూ ….  కేంద్రం సహకరించకపోయినా కంటోన్మెంట్ బోర్డు సభ్యుల కోరిక మేరకు  20 వేల లీటర్ల త్రాగు నీరు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి  నిర్ణయించినట్లు కంటోన్మెంట్ ప్రజల కు సంక్షేమం, అభివృద్ధి కి, మౌలిక సదుపాయాల  అభివృద్ధి కి మా వంతు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు.  డిఫెన్స్ భూమి, నివాస  స్థలాల కోసం 20 వేల  మందికి పంపిణీ  నిర్ణయం తీసుకున్నప్పటికీ కేంద్రం ఇవ్వడం లేదు. ఇచ్చిన భూమికి తిరిగి భూమి ఇస్తామని చెప్పిన పేదలకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు.  స్కై వే నిర్మాణాలకు  ల్యాండ్ ఇవ్వాలని కోరిన ప్రజల అసౌకర్యం కలిగే విధంగా వ్యవహరిస్తున్నాని తెలిపారు.  కంటోన్మెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి  మరో సారి కోరుతున్నామన్నారు. ఇప్పటికే వంద సార్లు  విన్నవించినా  కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.  అభివృద్ధికి ఆటంకం చేస్తూ లేనిపోని రాజకీయాలు మనస్సులో పెట్టుకుని రాజకీయ దురుద్దేశ్యంతో  చేయవద్దని ప్రజల పక్షాన కోరుతున్నామని అన్నారు.  రహదారుల విస్తరణకు  సహకరించాలని కోరిన ముందుకు రాలేదని ఇంకా పోరాటం  ఆగదని, మా ప్రయత్నం  కొనసాగిస్తామని అన్నారు. బోర్డు మెంబర్లు కూడా  సమర్థవంతంగా పని  చేస్తున్నారన్నారు . ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న  అభివృద్ధి  సంక్షేమ  కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

నాలా పనులు వర్షాకాలంలోగా పూర్తి చేయాలి

 నగరం లో   వరద ముంపు నివారణ కు   రూ. 858 కోట్ల అంచనా వ్యయంతో  నాలాల పునరుద్దరణ,  అభివృద్ది  పనులను చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. సనత్ నగర్, కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో గల  పికెట్ నాలా పై రసూల్ పుర జంక్షన్ వద్ద గల  రూ.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఆధునీకరణ    పనుల కు  రాష్ట్ర  పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి,  ఎమ్మెల్సీ వాణీ దేవి,  కంటోన్మెంట్  శాసన సభ్యులు సాయన్న, కమిషనర్  డి.ఎస్ లోకేష్ కుమార్ తో కలిసి  మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.  రూ. 45 కోట్ల అంచనా వ్యయంతో  బేగంపేట్ నుండి హుస్సేన్ సాగర్ వరకు కూకట్ పల్లి నాలా పై చేపట్టే పనులు అల్లం తోట బావి  బ్రాహ్మణ వాడిలో మంత్రి  కేటీఆర్ శంకుస్థాపన చేశారు.  పాటిగడ్డలో  రూ. 5.90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ కు మంత్రి కేటిఆర్  శంకుస్థాపన చేశారు. ఫంక్షన్ హాల్ ను అక్టోబర్ వరకు పూర్తి చేయాలి  పాటిగడ్డ వద్ద చేపట్టనున్న మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని  అక్టోబర్ లోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి కేటిఆర్ ఆదేశించారు. నిధులు, స్థల సమస్య లేనందున  నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపాలని మేయర్ ను  కోరారు. 

  ఆర్ అండ్ బి కి సంబంధించిన భూమి జిహెచ్ఎంసి మార్పు చేసి ఫంక్షన్ హాల్ మంజూరులో మంత్రి తలసాని విశేష కృషి చేశారని అన్నారు.  కాలనీ ప్రజల అవసరాలను గుర్తించి మంత్రి తలసాని కోరిక మేరకు మంజూరు చేయడం జరిగిందని హైదరాబాద్ లో  ప్రభుత్వం తీసుకున్న ఏ కార్యక్రమమైనా  సనత్  నగర్ నియోజకవర్గంలో ముందుగా తీసుకున్న  తర్వాత నే  ఇతర నియోజకవర్గంలో తీసుకోవడంతో  అన్ని  కార్యక్రమాలు విజయవంతం అవుతాయన్నారు.  నగరం లో ప్రభుత్వం నుండి పని చేయించుకోవడంలో గాని ప్రజలకు లాభం చేకూర్చే  పనులకు ముందంజలో  ఉంటారని  కేటీఆర్  కొనియాడారు. హైదరాబాద్ లో  రహదారులు  త్రాగు నీరు మౌలిక సదుపాయాలు  అందిస్తూ ప్రశాంత వాతావరణం  ఉందన్నారు. రాష్ట్రంలో మతాలకు  అతీతంగా షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి  పథకం ద్వారా ఇప్పటి వరకు 10 లక్షల మందికి రూ. 8421 కోట్ల రూపాయలను  పంపిణీ చేసినట్లు  మంత్రి వివరించారు.  ఈ కార్యక్రమం లో  ఎస్.ఎన్.డి.పి  సిఈ కిషన్, ఎస్.సి భాస్కర్ రెడ్డి, ఈ ఈ శ్రీనివాస్,  కార్పొరేటర్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here