ఈ-గోల్కొండ పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

0
202
Spread the love

ఈ-గోల్కొండ పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ చేనేత, జైళిశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ గోల్కొండ ప్లాట్‌ ఫాం (పోర్టల్‌)ను ప్రగతిభవన్‌లో గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ రూపొందించిన ఈ -గోల్కొండ ద్వారా అద్భుతమైన సంప్రదాయ కళాకృతులు, చేతి బొమ్మలను కొనుగోలు చేసే వీలు ఉంటుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చేనేత, జౌళిశాఖలో ఓ విభాగమైన హ్యాండీక్రాఫ్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తూ వస్తున్నట్లు చెప్పారు. అనేక అద్భుతమైన ఉత్పత్తులకు ప్రపంచస్థాయి ఈ-మార్కెట్‌ ప్లేస్‌ని తయారు చేయడమే లక్ష్యంగా పోర్టల్‌ను రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న అనేక ప్రైవేటు ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల కంటే అత్యుత్తమంగా ఈ వెబ్‌ పోర్టల్‌లో సౌకర్యాలు కల్పించామన్నారు.
దేశంలోని అన్ని ప్రాంతాలకు కళాకృతులు వెబ్‌సైట్‌లో ప్రస్తుతం దేశంలోని ఏ ప్రాంతానికైనా తమ కళాకృతులు చేర్చేందుకు వీలుందన్నారు. త్వరలోనే కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు పొంది.. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడికైనా కళాకృతులు పంపే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ- గోల్కొండ ద్వారా అమ్మకానికి ఉంచిన ప్రతి కళా కృతిని సునిశితంగా పరిశీలించేందుకు అవసరమైన 3డీ టెక్నాలజీని సైతం అందుబాటులో ఉంచామన్నారు. ఈ వెబ్‌సైట్‌ను మొబైల్ ఫోన్లకు సరిపడే విధంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. సైట్‌ ద్వారా రాష్ట్రంలో తయారవుతున్న హ్యాండీక్రాఫ్ట్, ఇతర అద్భుతమైన కళాకృతులకు మార్కెటింగ్, అవసరమైన ప్రచారాన్ని కల్పించే వీలు కలుగుతుందన్నారు. https://golkondashop.telangana.gov.in లింకు ద్వారా తమకు నచ్చిన కళాకృతులను ప్రజలు కొనుగోలు చేయవచ్చని కేటీఆర్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here