కోటి ఎక‌రాల‌కు సాగునీరు అందించ‌డ‌మే ల‌క్ష్యం – కేటీఆర్‌

0
377
Spread the love

కోటి ఎక‌రాల‌కు సాగునీరు అందించ‌డ‌మే ల‌క్ష్యం – కేటీఆర్‌

కోటి ఎక‌రాల‌కు సాగునీరు…. ప్ర‌జ‌లందరికీ తాగు నీరు అందించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. మళ్లీ రాష్ట్రానికి కాబోయే ముఖ్య‌మంత్రి కేసీఆర్ అని జోస్యం చెప్పారు. ఈ రోజు హైద‌రాబాద్ తాజ్‌డెక్క‌న్‌లో జ‌రిగిన‌ తెలంగాణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. రెండు జీవ‌న‌దులు తెలంగాణ‌లో పారుతున్నాయ‌ని… వాటి నుంచి నీటిని సంపూర్ణంగా వినియోగించుకొనే సంక‌ల్పంతో త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌న్నారు. డిసెంబ‌రు 11 త‌ర్వాత కాంగ్రెస్ పార్టీకి ఫీడేలు వాయించుకునే ప‌ని త‌ప్ప ఇంకా ఏమీ మిగ‌ల‌ద‌ని ఎద్దేవా చేశారు. తెజ‌న నేత కోదండ‌రామ్‌, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల వ్య‌వ‌హార‌శైలిపై తీవ్ర విమర్శ‌లు చేశారు మంత్రి కేటీఆర్‌.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here