ఉర్దూ జర్నలిజం ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిద్దాం

0
104
Spread the love

ఉర్దూ జర్నలిజం ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిద్దాం – హోం శాఖ మంత్రి మహమూద్ అలీ


ప్రపంచ వ్యాప్తంగా ఘన చరిత్ర కలిగి ఉన్న ఉర్దూ జర్నలిజానికి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో హైదరాబాద్ కేంద్రంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు.
తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న ఉత్సవాల ఏర్పాట్లపై ఇవ్వాళ మినిస్టర్స్ క్వార్టర్స్ లోని మంత్రి నివాసంలో ముఖ్యులతో నిర్వహించిన సమావేశంలో మహమూద్ అలీ మాట్లాడారు. దేశంలో ఉర్దూ జర్నలిజం 200 ఏళ్ళు పూర్తి చేసుకోవడం శుభ పరిణామమని ఆయన అన్నారు. ఈ సందర్భంలో హైదరాబాద్ లో టీయూడబ్ల్యూజేఎఫ్ ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉర్దూ భాష పై ఉన్న పట్టు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదన్నారు. ఈ ఉత్సవాలకు తమ ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రెండు రోజుల పాటు రవీంద్రభారతీలో ఈ ఉత్సవాలను నిర్వహించే విషయంలో తాను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రితో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తానని మహమూద్ అలీ స్పష్టం చేశారు. వెంటనే ఉత్సవాల సన్నాహక కమిటీని నియమించు కోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ, ఇంటర్ మీడియట్ బోర్డు కమిషనర్ ఉమర్ జలీల్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ప్రముఖ ఉర్దూ విద్యావేత్త, ప్రొఫెసర్ ఎస్.ఏ.శుకుర్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అతీఖ్ అహ్మద్, ఫ్యాప్సి మాజీ అధ్యక్షులు అనీల్ రెడ్డి, టీయుడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ఏ.మాజీద్, గౌస్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఫైసల్ అహ్మద్, హాబీబ్ జిలానీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here