14 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి

0
304
Spread the love

కేంద్రమంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు ఢిల్లీ లోని తన కార్యాలయం నుండి తెలంగాణ రాష్టానికి చెందిన 14 జాతీయ రహదారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ ద్వారా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు జాతీయ రహదారుల శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఎప్పటినుండోఎదురుచూస్తున్న
1) సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారి NH-365BB ( 58.626km)
2) నకిరేకల్-నాగార్జున సాగర్ NH- 565 ( 85.45km)
3) యాదాద్రి – వరంగల్ NH163 (99.103km)
4)నకిరేకల్ -తానంచర్ల NH365 (66.58 km) ,
జాతీయ రహదారుల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నచూపుచూడకుండా అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి గారితో పాటు తెలంగాణ లెజిస్లేటివ్ సెక్రెటరీ డా. వి.నర్సింహా చార్యులు, టి ఆర్ యస్ ఎల్పీ సెక్రెటరీ రమేష్ రెడ్డి, అసెంబ్లీ మీడియా కమిటీ ఛైర్మన్ సూరజ్ భరద్వాజ్ , శాసన మండలి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here