ప్రపంచమే అబ్బురపడే ప్రతిష్ఠాత్మక నిర్మాణం నూతన సెక్రటేరియట్

0
56
Spread the love

ప్రపంచమే అబ్బురపడే ప్రతిష్ఠాత్మక నిర్మాణం నూతన సెక్రటేరియట్

తెలంగాణ కే తలమానికం

సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచండి

సీఎం విధించిన నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలి

– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

TOOFAN – హైదరాబాద్:

ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సోమవారం నాడు నూతన సచివాలయం నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.

నిర్మాణ ప్రాంగణమంతా మంత్రి కలియతిరిగారు.ఫ్లోర్ వైస్ పనులు పరిశీలించారు.మినిస్టర్స్ చాంబర్స్,ఆఫీసర్స్ చాంబర్స్,వర్క్ స్టేషన్ ఏరియా పనులు,టైల్ ఫ్లోరింగ్ పరిశీలించారు. సైడ్ వాల్ గ్రిల్స్,గ్రాండ్ ఎంట్రీ,కాంపౌండ్ వాల్ రేయిలింగ్ గ్రిల్స్(మైల్డ్ స్టీల్) లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇటీవల తెప్పించిన మెయిన్ ఎలివేషన్ ఫినిషింగ్ ఏరియాలో ఉపయోగించే దోల్ పూర్(రెడ్ సాండ్) స్టోన్ ను పరిశీలించారు. పోర్టీకో స్లాబ్ పిల్లర్లకు సంబంధించిన జీఆర్సి (GRC) క్లాడింగ్ గురించి పలు సూచనలు చేశారు.కారిడార్ ఫాల్స్ సీలింగ్ సంబంధించిన శాంపిల్స్ పరిశీలించారు.ముఖ్యమంత్రి కేసిఆర్ ఇటీవల సందర్శించినప్పుడు పలు సూచనలు చేశారు.వాటికి సంంధించిన పనుల పురోగతి,నిర్మాణ శైలి మంత్రి పరిశీలించారు. నిర్మాణం ఫినిషింగ్ లో ఉపయోగించే ఇంటీరియర్ సామగ్రి పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల ప్రకారం ఫ్లోర్ వైస్ పనులు పూర్తి నాణ్యతతో, సమాంతరంగా జరగాలని అధికారులను,వర్క్ ఏజెన్సీ ని అదేశించారు.

నిర్మాణ పనుల్లో ఇంకా వేగం పెంచాలని,మూడు షిఫ్టుల్లో పనులు జరగాలని ఆర్ అండ్ బి అధికారులను,నిర్మాణ సంస్థ ప్రతినిధులను మంత్రి ఆదేశించారు.ఫినిషింగ్ పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, ముఖ్యమంత్రి కేసిఆర్ విధించిన నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలన్నారు.

మంత్రి వెంట ఈఎన్సి గణపతి రెడ్డి,ఈ.ఈ శశిధర్,ఎస్.ఈ లు సత్యనారాయణ,లింగారెడ్డి,పలువురు అర్ అండ్ బి అధికారులు,వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు,వాస్తు నిపుణులు సుధాకర్ తేజ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here