అత్యధునాతన సౌకర్యాలతో వరంగల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

0
191
Spread the love

అత్యధునాతన సౌకర్యాలతో వరంగల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

వరంగల్ లో నిర్మించే సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పై మంత్రి వేముల సమీక్ష

దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్స్ నిర్మించిన ముగ్గురు ఆర్కిటెక్ట్ లతో మంత్రి సమావేశం

మంగళవారం నాటికి డిజైన్ ప్లాన్ అందించాలని ఆర్కిటెక్ట్ లను కోరిన మంత్రి

హైదరాబాద్: ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వరంగల్ లో నూతనంగా నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం,బిల్డింగ్ డిజైన్ మరియు ఇతర అంశాలపై ఆర్ అండ్ బి మరియు మెడికల్ అండ్ హెల్త్ శాఖల అధికారులతో గురువారం ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బి కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహనిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

వరంగల్ లో అత్యధునాతన సౌకర్యాలతో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని మంత్రి వేముల అన్నారు. భారత దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిన అనుభవం గల ముగ్గురు ఆర్కిటెక్ లతో గురువారం మంత్రి స్వయంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు దేశంలోనే అత్యంత సౌకర్యవంతమైన అన్ని విభాగాల సమూహంతో కూడిన ఆస్పత్రిగా ఉండే విధంగా ప్లాన్లు తయారు చేయించాలని ఆర్కిటెక్ట్ లకు మంత్రి సూచించారు. మంగళవారం లోగా హాస్పిటల్ డిజైన్స్,ఎలివేషన్ లతో కూడిన ప్లాన్స్ సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఖాసీం రిజ్వి,ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి,నిమ్స్ డైరెక్టర్ మనోహర్,సూపరింటెండెంట్ సత్యనారాయణ,TSMSIDC డైరెక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి,ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here