సీఎం కేసిఆర్ దళిత బంధు పథకం తో…దళితుల దిశ,దశ మారాలి

0
43
Spread the love

సీఎం కేసిఆర్ దళిత బంధు పథకం తో…దళితుల దిశ,దశ మారాలి

కామారెడ్డి,నిజాంసాగర్ (TOOFAN) : వందలు, వేల గంటల మేధోమథనం, మేధావులతో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతిని కాంక్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దళితబంధు పథకం కు శ్రీకారం చుట్టారని రాష్ట్ర రహదారులు, భవనాలు, అసెంబ్లీ వ్యవహారాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమో ఓట్ల కోసమో ప్రవేశపెట్టలేదన్నారు. సిఎం కేసిఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా… దళిత బంధు పథకం ను సద్వినియోగం చేసుకుంటూ…. కూలీల నుంచి ఓనర్లు గా, సక్సెస్ పుల్ వ్యాపార వేత్తలు గా ఎదగాలనీ మంత్రి సూచించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం అవరణలో ఆదివారం దళితబంధు పైలట్ ప్రాజెక్టు పథకం కింద 882 లబ్ధిదారులకు యూనిట్ల మంజూరీ పత్రాలను పంపిణీ చేశారు. అరవై ఏళ్లుగా దళితుల కోసం అనేక పథకాలు అమలైనప్పటికీ సమాజంలో అత్యధిక మంది దళితులు అట్టడుగునే ఉన్నారని మంత్రి శ్రీ ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎలాంటి బ్యాంకు గ్యారెంటీలు లేకుండానే నేరుగా లబ్ధిదారులకు రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేసే పథకం దేశంలోనే మరెక్కడా లేదని తెలిపారు. లబ్ధిదారులు ఈ మొత్తాన్ని తమకు నచ్చిన వ్యాపార రంగంలో పెట్టుబడిగా పెట్టాలని అన్నారు. వ్యాపార నిర్వహణ ను సొంతంగా చూసుకోవాలని అన్నారు . కేసిఆర్ లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టడని…. కసి తో అవకాశం ను అందిపుచ్చుకుని  ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని మంత్రి అన్నారు. తద్వారా మరో పది మందికి ఉపాధి కల్పించాలన్నారు. ఎస్సి కార్పొరేషన్ స్కీమ్ ల మాదిరి కాకుండా …. దశల వారీగా దళిత బంధు పథకం ను అన్ని దళిత కుటుంబాలకు వర్తింపజేస్తామని మంత్రి శ్రీ ప్రశాంత్ రెడ్డి అన్నారు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాల పేదల అభ్యున్నతి, సంక్షేమం ను కోరుతూ… కేసిఆర్ నేతృత్వంలో ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే స్ఫూర్తిగా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొంటూ… ప్రభుత్వ ప్రాధాన్య పథకాల ఉద్దేశ్యాలను ప్రజలకు వివరించారు. 

ఎంపీ బిబి పాటిల్ మాట్లాడుతూ….మేనిఫెస్టో లో ఇచ్చిన ప్రతి హామీ తో చెప్పని పథకాలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్నారు తెలిపారు. సిఎం కేసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో గణనీయ ప్రగతి సాగదీస్తూ దేశానికే తలమానికంగా నిలుస్తుందని అన్నారు.

జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడారు. నిన్న మొన్నటి వరకు డ్రైవర్లుగా పనిచేసిన దళితులు ఇప్పుడు యజమానులు మారారని తెలిపారు. ప్రతి కుటుంబానికి లక్ష పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేయడం వల్ల దళిత కుటుంబాలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపాలని చెప్పారు. ఆర్థిక అసమానతలను రూపుమాపడం కోసం దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు పది లక్షలు తీసుకున్న లబ్ధిదారులు వచ్చే ఏడాది మే 1 నాటికి 20 లక్షలు జమ చేసి ఆర్థిక స్వాలంబన సాధించాలని పేర్కొన్నారు. సంగీతం గ్రామానికి బ్రిడ్జి ఏర్పాటు చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ని కోరారు.

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ… నిజాంసాగర్ మండలంలో50 శాతం మంది లబ్ధిదారులు గేదెల పెంపకం యూనిట్లు తీసుకున్నారని తెలిపారు. యూనిట్ల ద్వారా పాలను అధికంగా ఉత్పత్తి చేసి హైదరాబాద్ కు సరఫరా చేయాలని సూచించారు. జిల్లాలో అత్యధిక దళిత యూనిట్లను నిజాంసాగర్ మండలానికి ముఖ్యమంత్రి కెసిఆర్ మంజూరు చేశారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పథకం కింద మంజూరైన ప్రతి యూనిట్ సక్సెస్ అయ్యేలా సిఎం కేసిఆర్ కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. తెలంగాణ కే నిజాంసాగర్ ను ఈ పథకంలో మోడల్ గా నిలుపుతామని అన్నారు. సమావేశంలో నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఎంపీపీ జ్యోతి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, బాన్సువాడ ఆర్డీవో రాజా గౌడ్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈ డి దయానంద్, జడ్పీ సీఈఓ సాయాగౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here