వరద బాధితుల ఆవేదనను అర్థం చేసుకోండి – మంత్రి పువ్వాడ

0
51
Spread the love

వరద బాధితుల ఆవేదనను అర్థం చేసుకోండి
• ముంపునుంచి సీతారాములను కాపాడుకునేందుకు ముందుకు రాండ్రి…
• అందుకు కలుపుకున్న ఐదు వూర్లను తిరిగి తెలంగాణకు కేటాయించండి
– ఆంధ్ర ప్రదేశ్ మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ విజ్జప్తి
• ఇరు రాష్ట్రాల ప్రజలకోసం మాట్లాడిన తన మాటలను వక్రీకరించి విమర్శించడం సరికాదన్న రవాణా శాఖ మంత్రి
• అపార్థాలకు తావివ్వకుండా వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కలిసి పనిచేద్దామని పక్క రాష్ట్రానికి పిలుపు

గత మూడు రోజుల పాటు, వానల్లో తడుచుకుంటూ వాగులు వరదలు దాటుకుంటూ భధ్రాచలం పరిసర ప్రాంతాలలోని గోదావరి వరద బాధితులను సిఎం కెసిఆర్  పరామర్శిస్తూ పర్యటించారు. ముంపు బాధితులకు అందుతున్న సహాయ కార్యక్రమాల గురించి తెలుసుకుంటూ, రూ.1000 కోట్లతో తక్షణ కార్యాచరణ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రిగారికి ధన్యవాదాలు తెలిపేందుకు ఖమ్మం జిల్లా నేతలతో కలిసి నేను ఇవాళ హైద్రబాద్ లో మీడియా సమావేశం నిర్వహించాను. ఈ సందర్భంగా విలేకరులడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో గోదావరి వరదలు దాని నేపథ్యం దాని పర్యవసానాల గురించి మాట్లాడడం జరిగింది.
వరదలు వచ్చినప్పుడల్లా భధ్రాచలం చుట్టు పక్కల ప్రాంతంలోని జనావాసాలు ముంపునకు గురవతున్నాయి. ప్రజలతో పాటు దేవుడు కూడా ప్రతిసారీ ముంపునకు గురవ్వడం అత్యంత బాధాకరమైన విషయం. కరకట్ట నిర్మాణం సహా వరదలనుంచి ముంపుప్రాంతాల ప్రజలను కాపాడడం కోసం, శాశ్వతప్రాతిపదికన చర్యలకు సిఎం ఆదేశించారు. ఎత్తుజాగలో కాలనీలు సహా పలు ఇతర నిర్మాణాలను చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు వెయ్యి కోట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో కరకట్ట సహా ఇతర నిర్మాణాలను చేపట్టేందుకు.. ఏటపాక, కన్నాయి గూడెం, పిచుకల పాడు, పురుశోత్తం పట్నం, గుండాల అనే గ్రామాల పరిథిలో నిర్మాణాలు చేపట్టాల్సి వస్తున్నది.
తెలంగాణలోని ఈ గ్రామాలను ఏడు మండలాలతో పాటు ఆంధ్రాలో కలిపింది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం. పక్క రాష్ట్రంలోని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రం నిర్మాణాలను చేపట్టడం కష్టం కనుక , కనీసం ఈ 5 గ్రామాలనైనా తెలంగాణకు కేటాయిస్తే వరద నివారణ కోసం నిర్మాణాలను చేపడుతాం అని చెప్తున్నాం. అందుకు అటు కేంద్రాన్ని ఇటు వారి ముఖ్యమంత్రి జగన్ ను వొప్పించాలని కోరుతున్నాం. ఇదే విషయమై ఈ క్రమంలోనే నీను పొద్దున (మంగళవారం) మీడియాతో మాట్లాడాను. నీను మాట్లాడిన దాంట్లో తప్పేమున్నదో నాకర్థ కావడంలేదు. దీనిపై మంత్రులైన పెద్దలు బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబులు నన్ను తప్పుపడుతూ మాట్లాడడం బాధగావున్నది. ప్రజలూ దేవుడు మునగకుండా కరకట్టలు కట్టడానికి అవసరమైన ఐదు గ్రామాలను ఇవ్వాలని కోరుతుంటే, మరి మాకు హైద్రాబాద్ ను ఇస్తరా అంటూ… ఐదూల్లకు హైద్రాబాద్ కు లింకు పెడుతూ బొత్ససత్యనారాయణ గారు మాట్లాడడం అసందర్భం, అర్థ రహితం.
దేవుడు ఎవరికైనా దేవుడే. భధ్రాచల సీతారాములను ఇటు తెలంగాణ తో పాటు అటు ఆంధ్రా ప్రజలూ తమ ఇలవేల్పుగా కొలుచుకుంటారు. ఆంధ్రా మారుమూల ప్రాంతాలనుంచి వచ్చి తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటారు. అటువంటి తమ ఇష్ట దైవం నీల్లల్లో మునిగిపోతుంటే ఆంధ్రా ప్రజలకు కూడా బాధ కలగుతుంది కదా ? మరి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఆంద్రా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు పనిచేయాల్సిన అవసరం వున్నది కదా ? మీమూ అదే చెపుతున్నం.
వరదల శాశ్వత పరిష్కారానికి సిఎం కెసిఆర్ గారు 1000 కోట్లు ప్రకటించారు. బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు వంటి పెద్దలు వెంటనే చొరవతీసుకుని అటు తమ సిఎం జగన్ ను ఇటు మా సిఎం కెసిఆర్ గారితో సామరస్యపూరిత వాతావరణంలో చర్చలు జరిపేందుకు కృషి చేయాలి. మీము కూడా సహకరిస్తాం. మొత్తానికి భధ్రాచల రాములవారిని మునగకుండా చాడాలి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతున్న కరకట్టల నిర్మాణానికి, పేదల కోసం చేపట్టనున్న కాలనీల నిర్మాణానికి, ఆంధ్రాలో కలుపుకున్న ఈ ఐదూల్లను తెలంగాణలో విలీనం చేయడం అత్యవసరం. ఈ కీలకమైన పనిని మీ బాధ్యతగా సిఎం జగన్ తో చర్చించి కనీసం 5 గ్రామాలనైనా తెలంగాణకు ఇప్పించండి. ఈ గ్రామాలను కలిపితేనే భధ్రాచల రాములవారి దేవస్థానానికి కరకట్ట నిర్మాణం సాథ్యం అయిద్ది. భధ్రాచలం లో ముంపు సమస్యకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు తోడ్పాటునందించండి అని మీం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులను ప్రజా ప్రతినిధులను కోరుతున్నాం. ఈ సున్నిత మైన విషయాన్ని సానుకూలంగా అర్థం చేసుకోని సమస్య పరిష్కారానికి సామరస్య వాతావరణంలో పాటుపడాలని విజ్జప్తి చేస్తున్నాం. ఎటువంటి భేషజాలకు పోకుండా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకురావాలని విన్నవించుకుంటున్నాం. తద్వారా ఇటు తెలంగాణకు అటు ఆంధ్రా ప్రజలకు ఎంతో మేలు చేసినవారవుతారని భావిస్తున్నాం. ఇరు రాష్ట్రాల ప్రజలకోసం మాట్లాడిన నా మాటలను వక్రీకరించి విమర్శించడం సరికాదు. అపార్థాలకు తావివ్వకుండా వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కలిసి పనిచేద్దాం.
ధన్యవాదాలు
• పువ్వాడ అజయ్ కుమార్ , మంత్రి తెలంగాణ. మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, పౌరులు..
• భధ్రాచలం శ్రీ సీతారాముల వారి భక్తులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here