అక్క‌డ త‌క్ష‌ణ‌మే మౌలిక సదుపాయాలు కల్పించాలి – మంత్రి స‌త్య‌వ‌తి

0
62
Spread the love

అక్క‌డ త‌క్ష‌ణ‌మే మౌలిక సదుపాయాలు కల్పించాలి – మంత్రి స‌త్య‌వ‌తి

నిర్మల్ జిల్లా, పెంబి మండలం, చాకిరేవు గూడానికి తక్షణమే నీటి వసతి, మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తండాలు పంచాయతీలుగా మారి అన్ని వసతులు సమకూరుతున్న తరుణంలో ఇంకా మంచి నీటి కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం నిర్మల్ కలెక్టర్ కార్యాలయం చేరుకోవడానికి 75 కిలోమీటర్లు గూడెం వాసులు నడిచి రావడం బాధాకరమన్నారు. వెంటనే గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఆ గూడెం సందర్శించి, తాగునీరు, విద్యుత్, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here