ఫెన్సింగ్ క్రీడాకారుల‌ను అభినందించిన మంత్రి

0
99
Spread the love

ఫెన్సింగ్ క్రీడాకారుల‌ను అభినందించిన మంత్రి

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ఒడిశా రాజధాని కటక్ లో జూన్ – 29 నుండి జులై 2 వరకు జరగనున్న 30 వ Jr. నేషనల్ ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల కు చెందిన 16 మంది క్రీడాకారులు ఎంపికైనా సందర్భంగా ఎంపికైనా క్రీడాకారులను, కోచ్, క్రీడా పాఠశాల OSD డా. హరికృష్ణ ను అభినందించారు.

 

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ… జాతీయ స్థాయిలో జరుగుతున్న ఫెన్సింగ్ చాంపియన్ షిప్ లో మన రాష్ట్రం నుండి 24 మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఎంపికయ్యారన్నారు. అందులో క్రీడా పాఠశాల కు చెందిన 16 మంది క్రీడాకారులు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ గారు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి అనేక చర్యలు చేపత్తుతున్నారన్నారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నేడు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి – పల్లె ప్రగతి లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 2 శాతం రిజర్వేషన్లు, ఉన్నత విద్య లో 0.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ నీ రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ను క్రీడా హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా పాఠశాల OSD డా. హరికృష్ణ, కోచ్ లు, క్రిడా పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here