జీవోల ప్రకారమే నదీ జలాలను వినియోగం.. ఏపీ వితండవాదన చేస్తోంది

0
99
Spread the love

జీవోల ప్రకారమే నదీ జలాలను వినియోగం.. ఏపీ వితండవాదన చేస్తోంది

                మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శ 

హైదరాబాద్ జూలై 2 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ):: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టు నుంచి.. ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేయక ముందే.. కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఎలా కోరుతుందని ప్రశ్నించారు. కేంద్రంతో ఏదైనా ఒప్పందం ఉందా? అని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్‌, కిరణ్‌, రోశయ్య ఇచ్చినవి ఉత్తుత్తి జీవోలా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమం ఎలా అవుతాయని మంత్రి అన్నారు. తాము నిబంధనలు అతిక్రమించలేదని, జీవోల ప్రకారమే నదీ జలాలను వినియోగిస్తున్నామన్నారు. దీనిపై ఏపీ వితండవాదన చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం కూడా తెలంగాణకు న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో న్యాయస్థానంలో పోరాటం చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here