Spread the love
కనకరాజు.. దర్శనం మొగులయ్య లను ఘనంగా సన్మానించిన మంత్రి
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన నివాసంలో నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసల కుంట గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారులైనా 12 మెట్ల కిన్నెర విద్వాంసులు దర్శనం మొగులయ్యని, గిరిజనుల ఆరాధ్యదైవం గుస్సాడీ నృత్య కళాకారుడు పద్మ శ్రీ అవార్డు గ్రహీత కనక రాజు, ప్రముఖ ఫోటోగ్రఫర్ భరత్ భూషణ్ లకు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు ప్రత్యేక పెన్షన్ రూపాయలు 10 వేలను అమలు చేయాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా మంత్రి కనకరాజు, దర్శనం మొగులయ్య లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు , సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ లు పాల్గొన్నారు.