ప్రపంచ పర్యాటక దినోత్సవాల నిర్వ‌హ‌ణ‌కు రూ. 27.50 ల‌క్ష‌లు – ప‌ర్యాట‌క మంత్రి

0
106
Spread the love

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ ల మంత్రి  వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో పర్యాటక, హెరిటేజ్ తెలంగాణ శాఖల పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  అదేశాల మేరకు ప్రపంచ పర్యాటక దినోత్సవం ( సెప్టెంబర్ – 27) ను తెలంగాణ పర్యాటక శాఖ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అదేశించారు. ఆ సమీక్షా సమావేశంలో ప్రపంచ పర్యాటక ధినోత్సవం ను జిల్లా కేంద్రాలలో ఘనంగా నిర్వహించటానికి సిఎం కెసిఆర్  రూ. 27.50 లక్షలను మంజూరు చేసారన్నారు మంత్రి శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్ . అందులో భాగంగా ఆయా జిల్లాలలో మంత్రులు, జిల్లా కలేక్టర్ల అధ్వర్యంలో ఘనంగా నిర్వహించటానికి పర్యాటక శాఖ 27.50 లక్షల రూపాయలను జిల్లాలకు విడుదల చేస్తున్నామన్నారు. ( రాష్ట్ర స్థాయిలో 12 లక్షలు, ప్రతి జిల్లా కేంద్రానికి 50 వేల రూపాయలు ) మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ . రాష్ట్రంలో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలకు తగిన ప్రచారం నిర్వహించేందుకు పర్యాటక , హెరిటేజ్ తెలంగాణ శాఖ ల సంయుక్త అద్వర్యంలో ప్రణాళికలను రూపోందించాలని మంత్రి అధికారులను అదేశించారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం కు తగిన ప్రచారం నిర్వహించాలని మంత్రి అధికారులను అదేశించారు. రాష్ట్రంలో రామప్ప దేవాలయం తో పాటు అనేక ప్రపంచ స్థాయి చారిత్రక కట్టడాలు వున్నాయి. వాటిని గుర్తించి తగిన ప్రతిపాదనలను తయారు చేసి యునెస్కో కు సమర్పించాల్సిందిగా మంత్రి అదికారులను అదేశించారు. పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, జలపాతాలపై వీడియో, ఆడియో లను చిత్రికరించి వాటిని ప్రచార మాద్యమాల ద్వారా ప్రచారం నిర్వహించాలని సూచించారు.

పర్యాటక ప్రాంతాల ప్రచారంలో బాగంగా ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ లలోని హోర్డింగ్ ల ద్వారా అవసరమైన ప్రచారాన్ని నిర్వహించాలని మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు అదేశించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆయా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాల పై బ్రోచర్ల ద్వారా ప్రచార సామాగ్రి ని ముద్రించి వాటికి విశేష ప్రాచుర్యం కల్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు లేఖలు రాయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కి మంత్రి సూచించారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో బాగంగా కాకతీయ హెరిటేజ్ సర్య్కూట్ , ట్రైబల్ సర్య్కూట్, కాళేశ్వరం సర్య్కూట్, మహబుబ్ నగర్ సర్య్కూట్, హైదరాబద్ సర్య్కూట్ లకు దేశంలోని ప్రధాన నగరాలైన డిల్లీ, ముంబాయి, కలకత్తా, బెంగుళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, మొదలైన నగరాలలోని ఎయిర్ ఫోర్టులు, రైల్వే స్టేషన్లు లలో వివిధ మాద్యామాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు. 2020 సంవత్సరానికి గాను ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకోని ప్రకటించిన అవార్ఢులను కోవిడ్ కారణంగా ఇవ్వలేకపోయినందు వల్ల ఈ అవార్డులను ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవాల సందర్భంగా అందజేయడం జరుగుతుందన్నారు మంత్రి శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్ గారు.
2021 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అవార్డులను రాష్ట్రంలోని పర్యాటక అభివృద్ధికి విశేష కృషి చేసిన కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తించబడిన ట్రావెల్ ఏజేంట్లు , టూర్ అపరేటర్లు , హోటళ్లు, రెస్టారెంట్లు తో పాటు వివిధ విభాగాలలో అవార్డులు అందజేస్తామన్నారు. అందుకు పర్యాటక శాఖ వెబ్ సైట్ www.telanganatourism.gov.in లో వివరాలను డౌన్ లోడ్ చేసుకోని ప్రతిపాదనలను సెప్టెంబర్ 4 వ తేది లోగా పర్యాటక శాఖ కార్యాలయంలో అందజేయాలని మంత్రి శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్ గారు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ కె యస్ శ్రీనివాస రాజు , జాయింట్ సెక్రెటరీ కె. రమేష్, పర్యాటకాభివృద్ది సంస్థ M D మనోహర్, E D శంకర్ రెడ్డి, టూరిజం అధికారులు ఓం ప్రకాష్, మహేష్ , హెరిటేజ్ తెలంగాణ శాఖ అధికారులు నారాయణ, రాములు నాయక్, మాధవి, రాజు తదితరులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here