చెరువు లో చేప పిల్లల విడుదల చేసిన మంత్రి

0
61
Spread the love

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  V. శ్రీనివాస్ గౌడ్  మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం లో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోడూరు గ్రామ మైసమ్మ చెరువు లో చేప పిల్లల విడుదల కార్యక్రమం లో పాల్గొని చేప పిల్లలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారులు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కులవృత్తులకు పూర్వ వైభవాన్ని తెచ్చారన్నారు. అందులో భాగంగా మత్స్యకారుల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాహించి వారికి ఆధునిక వలలు, మోఫెడ్ లు, ఆటోలు, DCM రవాణా వాహనాలను మత్స్యకారులకు అందించటం తో పాటు కోట్లాది చేప పిల్లలను ఉచితంగా అందించిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  రాజేశ్వర్ గౌడ్, జిల్లా జాయింట్ కలెక్టర్  సీత రామారావు, DCCB డైరెక్టర్ నర్సింహులు, జిల్లా మత్స్య శాఖ సహాయ సంచాలకులు రాధ, జిల్లా కో ఆప్షన్ సభ్యులు అల్లాఉద్దీన్, మండల రైతు బంధు అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు, JPNC కాలేజ్ డైరెక్టర్ రవికుమార్, జిల్లా సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, గ్రామ TRS పార్టీ అధ్యక్షుడు బుచ్చిబాబు గౌడ్, గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు విజయ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here