మెడల్స్ సాధించిన క్రీడాకారిణిని అభినందించిన‌ మంత్రి

0
92
Spread the love

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్  హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆగస్టు 18, 19 వ తేదీల్లో బెంగుళూరు లోని కంఠీరవ స్టేడియంలో జరిగిన పార ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన 4వ ఇండియన్ ఓపెన్ నేషనల్ పార అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ – 2022 లో రాష్ట్రానికి చెందిన K. లోకేశ్వరి మహిళల S 37 విభాగంలో షాట్ ఫుట్ లో సిల్వర్, డిస్కస్ త్రో లో బ్రాంజ్ మెడల్స్ సాధించిన సందర్భంగా రాజేంద్ర నగర్ శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్, చైర్మన్ వాసుదేవ రెడ్డి గార్లతో కలసి అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్  ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయిలో రాష్ట్రానికి రెండవ స్థానంలో నిలిపారన్నారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. పార ఒలింపిక్స్ కమిటీ జాతీయ స్థాయిలో నిర్వహించిన క్రీడల్లో ప్రతిభను కనబరిచిన లోకేశ్వరి ని అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, దేశానికీ పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటామని మంత్రి  శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, కోచ్ వేణు, పార అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here