నాటక కళలకు సంబంధించిన గ్రంథాల ఆవిష్క‌ర‌ణ‌

0
46
Spread the love

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో తెలంగాణ సంగీత, నాటక అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ లో ప్రాచీన కాలం నుంచి నేటి వరకు సంగీత, నృత్య, నాటక కళల అవతరణ వికాశాల పై పలువురు పరిశోధకుల చేత ప్రత్యేకంగా రాయించి ప్రచురించిన మూడు గ్రంథాలను రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ శ్రీ బాద్మి శివకుమార్ గారితో కలసి ఆవిష్కరించారు.

తెలంగాణ కళా సాంస్కృతుల పునర్నిర్మాణం, పునరుజ్జీవనం కోసం సాగుతున్న కృషిలో సంగీత నాటక అకాడమీ శ్రమకోర్చి వెలువరించిన ఈ గ్రంథాలు ఎంతో ప్రత్యేకమన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు. భవిష్యత్తులో ఈ కళల్లో వచ్చే మరిన్ని గ్రంథాలకు ఇవి రిఫరెన్స్ గా ఉపయోగపడతాయన్నారు. సంగీత నాటక అకాడమీ గత మూడేళ్లలో తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నాటక అభివృద్ధి పూర్వకాలంలో వేయించిన శాసనాలు, ఆలయ శిల్పాలు, కావ్యాల్లోని ఆధారాలను అన్వేషించి పలువురు పరిశోధకులు చేత ఈ వ్యాసాలు వ్రాయించి ఈ సంకలనాల్లో చేర్చబడిందన్నారు. సంగీతంలో ప్రొఫెసర్ వి తిరుపతయ్య , డా. హిందోళ, H రమేష్, ఈగ సాంబయ్య తదితరులు , నృత్యంలో డాక్టర్ జొన్నలగడ్డ అనురాధ అలేఖ్య కళా కృష్ణ డాక్టర్ సత్యనారాయణ తదితరులు, నాటకంలో డాక్టర్ నర్సయ్య ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ డాక్టర్ శివనాగిరెడ్డి డాక్టర్ కోట్ల హనుమంతరావు తదితరులు ఈ పుస్తకాల్లో పలు పరిశోధన వ్యాసాలు వ్రాశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు వారందరినీ అభినందించి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ డా. ఆయాచితం శ్రీధర్, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ K S శ్రీనివాస రాజు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సంగీత నాటక అకాడమీ కార్యదర్శి వసుంధర, డా. చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here