SNDP చేపట్టిన నాలాల అభివృద్ధిలపై స‌మీక్ష చేసిన మంత్రులు

0
74
Spread the love

SNDP చేపట్టిన నాలాల అభివృద్ధిలపై స‌మీక్ష చేసిన మంత్రులు

ఎన్నో సంవత్సరాల నుండి నాలా పరిసర ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ముంపు సమస్యకు సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (SNDP ) తో శాశ్వతంగా పరిష్కారం లభించనున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో నగరంలోని పలు ప్రాంతాలలో SNDP కార్యక్రమం క్రింద చేపట్టిన నాలాల అభివృద్ధిలపై హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ సుదీర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, MLC సురభి వాణీదేవి, MLA లు మాగంటి గోపినాధ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, SNDP ENC జియా ఉద్దిన్, CE కిషన్, వసంత, SE లు రత్నాకర్, అనిల్ రాజ్, భాస్కర్ రెడ్డి, జోనల్ కమిషనర్ లు శ్రీనివాస్ రెడ్డి, రవి కిరణ్, వాటర్ వర్క్స్ DOP లు కృష్ణ, స్వామి, CGM లు ప్రభు, ఎలెక్ట్రికల్ DE సుదీర్ కుమార్, ట్రాపిక్ ACP జ్ఞానేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సుమారు 50 సంవత్సరాల నుండి నగరంలోని అనేక ప్రాంతాలలో వర్షాకాలంలో వచ్చే వరదనీటి తో నాలాల పరిసర కాలనీలు ముంపుకు గురై ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. పలు చోట్ల నాలాల పై ఆక్రమ నిర్మాణాలు చేపట్టగా, మరికొన్ని చోట్ల నాలాల వెడల్పు తగ్గిపోవడం వంటి కారణాలతో సాఫీగా నీరు ముందుకు సాగక వరదనీటి ముంపు సమస్య ఏర్పడుతుందని వివరించారు. నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక చొరవతో ప్రత్యేకంగా SNDP వ్యవస్థను విభాగాన్ని ఏర్పాటు చేసి నాలాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని వివరించారు. ఇందుకు గాను 945 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారానికి కనీసం ఎలాంటి ఆలోచన చేయలేదని అన్నారు. SNDP కార్యక్రమం క్రింద సికింద్రాబాద్ జోన్ లో 8, ఖైరతాబాద్ జోన్ లో 6 మొత్తం 14 పనులు మంజూరు కాగా, పనుల పురోగతి పై SNDP ప్రాజెక్ట్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పనులు చేపట్టడంలో ఏమైనా సమస్యలు ఎదురయితే స్థానిక MLA ల దృష్టికి లేదా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని పద్మ కాలనీ నుండి శివానంద్ నగర్ వరకు గల 902 మీటర్ల నాలా విస్తరణ పనులను చేపట్టేందుకు 39 కోట్ల రూపాయలు మంజూరైనాయని, పనులు చేపట్టేందుకు 132 KV, 33 KV విద్యుత్ కేబుల్స్, సీవరేజ్ లైన్ అడ్డంకిగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 4 వ తేదీన హిమాయత్ నగర్ లోని దత్త నగర్ నాలా, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నాగమయ కుంట నాలా, అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని పద్మ కాలనీ, పటేల్ నగర్ లలో, 7 వ తేదీన LB నగర్ లో నాలా అభివృద్ధి జరుగుతున్న పలు ప్రాంతాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నాగమయ కుంట నాలాకు వచ్చే వరదనీటి సమస్య పరిష్కారానికి నల్లపోచమ్మ ఆలయం వద్ద, హెరిటేజ్ షాప్ వద్ద బ్రిడ్జి ల విస్తరణ పనుల కోసం 12 కోట్ల రూపాయలు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట డివిజన్ లో గల నాలా కు వచ్చే వరదతో పరిసర ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో నాలా అభివృద్ధి పనుల కోసం 45 కోట్ల రూపాయలను SNDP కార్యక్రమం క్రింద నిధులను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఈ నిధులతో బ్రాహ్మణవాడి, మయూర్ మార్గ్ మరియు ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్లోని కూకట్పల్లి నాలాపై రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, నీటి సరఫరా మరియు మురుగునీటి లైన్లను పునరుద్దరించడం, నాలా వెంట రహదారులను VDCCతో అభివృద్ధి చేయడం వంటి పనులను చేపట్టడానికి, బ్రాహ్మణవాడి మరియు ప్రకాష్ నగర్ ప్రాంతాలలో గ్యాప్ పోర్షన్లలో కొత్త రిటైనింగ్ వాల్ల నిర్మాణం మరియు ఇప్పటికే ఉన్న రిటైనింగ్ గోడల ఎత్తును పెంచడం వంటి పనులను చేపట్టేందుకు మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు చేతులమీదుగా శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా SP రోడ్ లో గల కరాచీ బేకరీ వద్ద పికెట్ నాలా పై ప్రస్తుతం ఉన్న వంతెనను మరింత ఎత్తులో నిర్మించడం కోసం 10 కోట్ల రూపాయలు మంజూరైనాయని పేర్కొన్నారు. ఈ పనులకు కూడా శంకుస్థాపన చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ వంతెన నిర్మాణం జరిగితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్లోని దాదాపు 100 కాలనీల ప్రజలకు, అన్నానగర్ బస్తీ, ఆసియాలోని అతిపెద్ద మురికివాడలలో ఒకటిగా ఉన్న రసూల్పురా బస్తీ, BHEL కాలనీ, ICRISAT కాలనీ, సౌజన్య కాలనీ మరియు బోవెన్పల్లిలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు. మినిస్టర్ రోడ్ లోని పికెట్ నాలా పై గల వంతెన రీ మోడలింగ్ పనుల కోసం 20 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు చెప్పారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని నాగిరెడ్డి చెరువు, కాప్రా చెరువులను కలుపుతూ స్ట్రాం వాటర్ లైన్ కోసం 41 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని మోహిని చెరువు నుండి మూసీ రివర్ వరకు ఆకాష్ నగర్, చెన్నారెడ్డి నగర్, పోలీస్ లైన్ ల మీదుగా ఇంటిగ్రేటెడ్ న్యూ డ్రెయిన్ కోసం 22 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఖైరతాబాద్ జోన్ లోని షా హతీం నుండి లంగర్ హౌస్ వరకు 2752 మీటర్ల నాలా అభివృద్ధి పనులు, కల్వర్ట్ నిర్మాణ పనుల కోసం 31.92 కోట్ల రూపాయలు మంజూరైనట్లు చెప్పారు. నదీం కాలనీ నుండి షా హతీం వరకు నాలా అభివృద్ధి పనుల కోసం 31.92 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. మజీద్ ఏ అబూబాకర్ నుండి షా హాతీం వరకు గల నాలా అభివృద్ధి, పునరుద్దరణ పనుల కోసం 31.92 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు వివరించారు. బల్కాపూర్ నాలా పునరుద్దరణ పనుల కోసం 56.34 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ప్రస్తుతం నాలా లో పూడిక తొలగింపు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అఫ్జల్ సాగర్ నాలా అభివృద్ధి పనుల కోసం 12 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని, ఈ పనులు పూర్తయితే కిషన్ గంజ్, ఉస్మాన్ గంజ్, హబీబ్ నగర్ తదితర ప్రాంతాల ప్రజలకు ముంపు సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ఎర్రగడ్డ నాలా అభివృద్ధి పనుల కోసం 12.86 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని, పనులను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. ఈ నాలా అభివృద్ధి పనులు పూర్తయితే AG కాలనీ, నటరాజ్నగర్, సుల్తాన్ నగర్, గౌతంపురి కాలనీ, ఆనంద్నగర్, ప్రేమ్నగర్, మోతీనగర్, NH-65 తదితర ప్రాంతాల ప్రజలకు ముంపు సమస్యకు శాశ్వతంగా పరిష్కారం కానున్నదని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here