ప్రజా భాగస్వామ్యంతో పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమాలు

0
119
Spread the love

ప్రజా భాగస్వామ్యంతో పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలివిగా నిధులు వినియోగించి పల్లెలు అభివృద్ధి చేస్తున్నారు

-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్, భీమ్గల్:

ప్రజా భాగస్వామ్యంతోనే పల్లె ప్రగతి కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని రాష్ట్ర రోడ్లు , భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

గురువారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా,జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.వేల్పూర్ మండల కేంద్రంలో పలు కాలనీలు,మర్సు చెరువు సందర్శించారు. కాలినడకన గ్రామంలో తిరుగుతూ పలువురు గ్రామస్తులను ఆరోగ్యం ఎట్లా ఉన్నది అంటూ ఆప్యాయంగా పలకరించారు.
గ్రామానికి సంబంధించిన సమస్యలను అవసరాలను స్థానిక సర్పంచ్,వార్డు సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ చెరువు దగ్గర డ్రైనేజీ కట్టించి నీళ్ళు వెళ్ళే విధంగా మైదానం చదును చేయించి చెట్లు పెట్టించి బ్రతుకమ్మ ఆడటానికి వచ్చే మహిళలకు అనుకూలంగా. ఏర్పాటు చేయాలన్నారు
అందుకు 10 లక్షల రూపాయలు కావాలని వెంటనే కలెక్టర్ గారు మంజూరు చేయడం జరిగిందన్నారు. గురిడి రెడ్డి సంఘం నుండి ఎస్సీ కాలనీ వరకు డ్రైనేజి సరిగా లేనందున పెద్ద మురుగు కాలువ కట్టడానికి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అందుకు మంత్రిగారు 10 లక్షల నిధులు, గ్రామపంచాయతీ నుండి 10 లక్షల నిధులు ఏర్పాటు చేసుకొని పూర్తి చేయాలన్నారు.
గ్రామంలో వంగిన కరెంట్ పోల్స్ లూజు వైర్లు పది రోజుల్లో సరిచేయాలని ఎస్ఇ ఎలక్ట్రిసిటీని ఆదేశించారు. మిషన్ భగీరథ పైప్లైన్ నాలుగు పైప్లైన్ లీక్ ఉన్నందున వాటిని సరిచేయాలని మిషన్ భగీరథ అధికారిని ఆదేశించారు. గత సంవత్సరం 40వేల చెట్లు పెట్టినమని నివేదికలో చదివింది 1200 మినహా అన్ని బ్రతికి ఉన్నాయన్నారు. చాలా సంతోషం చనిపోయిన చోట వేరే మొక్కలను అటవీశాఖ ఇవ్వాలని ఆదేశించారు. వేల్పూర్ లో ప్రతి ఇంటికి మొక్కలను ఇవ్వాలని వారిని ఆదేశించారు.
మన ఇంటిలో. వాడలో. ఊరిలో మంచిగా జరగాలనే ఆలోచన నుండి పుట్టుకొచ్చినదే పల్లె ప్రగతి కార్యక్రమం అన్నారు.
కరెంటు 24 గంటలు వస్తుంది మంచినీళ్లకు ఇంతకుముందు ఇబ్బంది ఉండే ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ పోచంపాడు నుండి నీళ్లు తెచ్చుకునే ఇస్తున్నామన్నారు పేదవారికి పెన్షన్ 57 సంవత్సరాల వారికి రావాలి రెండు సంవత్సరాల నుండి కోవిడ్ కారణంగా ఇవ్వలేకపోయాము. ఇంతవరకు ఇచ్చేది తొందరలో కొత్తవి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని లాక్ డౌన్ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిందని కొంత ఇబ్బంది అవుతుందని రైతులకు రైతుబంధు ఉచిత కరెంటు ఎండాకాలం కూడా చెరువులో నీళ్ళు నింపుకునే కార్యక్రమం జరిగిందన్నారు. రైతులకు రైతు బీమా, రైతుబంధు ఇస్తున్నామన్నారు.

ఇల్లు లేనివారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు వేల్పూర్ లో మొదలు పెట్టడం జరిగింది నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.
పేద ఆడపడుచులకు కల్యాణలక్ష్మి కింద ప్రభుత్వం లక్ష రూపాయలు ఖర్చు ఇస్తుందని డెలివరీ హాస్పిటల్ ఖర్చులు కెసిఆర్ కిట్టు డెలివరీ మగబిడ్డకు 12 వేలు ఆడబిడ్డకు 13 వేలు ప్రభుత్వం పరంగా అందించడం జరుగుతుందన్నారు
2014 కు ఇప్పటికీ చాలా మార్పు అయిందని గ్రామాలలో కొన్ని కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉందని కేసీఆర్ గుర్తించారని ఊర్లో డ్రైనేజీ .రోడ్లు. బాగుండాలని పచ్చదనం పెంచాలని దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని మురికి కాలువలో క్లీన్ చేయడం గ్రామాలు మంచిగా ఉండాలని అందుకే చెట్లు పెంచడం
అన్నిటికీ డబ్బులు ఏర్పాటుచేసి సర్పంచులకు బాధ్యత పెట్టి గ్రామాలకు డబ్బులు పంపించి పనుల్లో అయ్యేవిధంగా చూస్తున్నాడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలోనూ గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ పేరు మీద గ్రామ పంచాయతీలకు నిధులు వస్తది
తర్వాత గ్రామ పంచాయతీ ఇంటి పన్ను తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉండేది ఆ నిధులు కరెంటు బిల్లు కట్టడానికి జీతాలకు సరిపోయేది అని అన్నారు. వేల్పూర్ గ్రామ పంచాయతీకి
కేంద్రం ఎంత ఇస్తూ ఉందో రాష్ట్రం కూడా అంతే ఇవ్వాలని ప్రభుత్వం కోటి ఇరవై ఆరు . ఇరవై రెండు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కోటి 15 లక్షల రూపాయలు పంపింది కేంద్రం కెసిఆర్ మొత్తం రెండు కోట్ల 40 లక్షల రూపాయలు వచ్చినవి వేల్పూర్ రెండు కోట్ల నలభై లక్షలతో అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకర్ సమకూర్చడం జరిగింది అన్నారు ఉపాధి హామీ పథకం ద్వారా గత సంవత్సరం 26లక్షల రూపాయలు వేల్పూరు గ్రామానికి వచ్చేవని ఈ సంవత్సరం పని బాగా చేయడం వల్ల ఈసారి 50 లక్షల రూపాయలు పని జరిగిందని వాటిలో వైకుంఠ గ్రామాలు డంపింగ్ యార్డ్ రైతు వేదికలు పల్లె ప్రకృతి ఏర్పాటు వేల్పూర్ గ్రామంలో
చాలా పనులు చేసేది ఉంది సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ పెట్టాలని ఉందిబైపాస్ రోడ్డు డబుల్ లైన్ చేయాలని వెంకటాపూర్ రోడ్డు డబుల్ చేయాలని, జానకంపేట డబుల్ రోడ్డు చేయాలని వాగుపైన బ్రిడ్జి చేపట్టాలని గ్రామస్తులు చేసిన విజ్ఞప్తి మేరకు తను పుట్టిన గ్రామానికి మండలానికి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

అనంతరం భీమ్గల్ మున్సిపల్ కేంద్రంలో పట్టణ ప్రగతి లో భాగంగా హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు.మొక్కలు పెంచడం వల్ల పచ్చదనం పెరిగి వాతావరణం సమతుల్యత మెరుగుపడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాతే హరితహారం కార్యక్రమంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించుకుంటున్నామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ సలీం, డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ఈగ గంగారెడ్డి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ ఎంపీపీ జడ్పిటిసి భారతి ఆర్టీవో నెంబర్ రాములు ఎంపీటీసీ మహేష్ ఉప సర్పంచ్ సత్యం రెడ్డి పంచాయతీరాజ్ మిషన్ భగీరథ ఈ ఆర్డీవో శ్రీనివాస్ శ్రీనివాస్ అటవీశాఖ అధికారులు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here