Spread the love
విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి దంపతులు
హైదరాబాద్: నగరంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారిని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కోకపేటలో తన మిత్రుని నివాసంలో స్వరూపానందేంద్ర స్వామి ఆద్వర్యంలో నిర్వహించిన హోమంలో సతీ సమేతంగా పాల్గొని మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.