క్రిస్మస్ పండుగ అందరి కుటుంబాలలో వెలుగులు నింపాలి- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

0
236
Spread the love

నిజామాబాద్. తేది:16-12-2020:

బుధవారం స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన క్రిస్మస్ పండుగ సందర్భంగా దుస్తుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తో కలిసి క్రైస్తవులకు బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సమాజంలో ఉన్న పేదవారు సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.
దేశంలో లో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా ఇవాళ బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని తెలిపారు.
బట్టలు పంచడం అంటే ఇది డబ్బు తో కూడుకున్నది కాదని ఇది మనసుతో కూడుకున్న కార్యక్రమం అన్నారు.
హిందువుల పండుగ బతుకమ్మ ముస్లింల పండుగ రంజాన్ క్రిస్మస్ పండుగ క్రిస్మస్ బాగా జరుపుకోవాలి అనే ఉద్దేశం
ముఖ్యంగా ఈ దేశం లో ఎవరైతే మైనారిటీస్ అని చెప్పి కొంత బాధ పడుతున్నారో బాధపడే వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి బాధలో ఉండకుండా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కెసిఆర్ ఆర్ గారు ఆరు సంవత్సరాల క్రితం చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను అన్నారు క్రైస్తవం అంటే ప్రేమ. త్యాగం. సేవ. క్రైస్తవ సమాజం చాలామంది ఈ మూడింటికి కట్టుబడి ఉన్నారన్నారు.
రంజాన్ పండుగ క్రిస్మస్ పండుగ వస్తే మైనార్టీ వర్గాలు కాబట్టి వాళ్లకు ఆత్మన్యూనతా భావం ఉంటుంది కాబట్టి ఈ పండుగలు జిల్లా కేంద్రంలో అయితే జిల్లా మంత్రి జిల్లా కలెక్టర్ నియోజకవర్గాల్లో అయితే నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్ డి ఓ అధికారికంగా పాల్గొనాలి. అప్పుడే ప్రభుత్వం ఉన్నది అన్న ఒక ధైర్యం
ఆ వర్గాలకు వస్తుంది అని చెప్పి దీన్ని వాళ్ళ అధికార కార్యక్రమం గా చేసిండ్రు.
దాదాపు 99 శాతం క్రైస్తవుల సమాజంలో పేదవారు కెసిఆర్ గారు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్లు. కల్యాణ లక్ష్మి. రెసిడెన్షియల్ స్కూల్స్. ప్రభుత్వ హాస్టల్లో సన్నబియ్యం. స్కాలర్షిప్స్ నిరుద్యోగులకు సైకిల్స్ ఇచ్చి ఆదుకోవడం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలలో మన క్రైస్తవ సమాజం సింహభాగం గా కార్యక్రమాలను తీసుకుంటున్నాయి అన్న విషయం మనవి చేస్తున్నా. దేశంలో ఎక్కడా జరగని సంక్షేమ పథకాలు. కెసిఆర్ కిట్ డెలివరీ అయిన తర్వాత 12 వేల రూపాయలు తల్లి బిడ్డ బాగుండాలని బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరుగుతుందన్నారు. నిజాంబాద్ లో క్రైస్తవులు 20 గుంటల భూమికి నిధులు, కమ్యూనిటీ హాల్ అడుగగా కలెక్టర్ గారికి చెప్పి ఆ ప్రయత్నం జరుగుతుంది అన్నారు పేద క్రైస్తవులకుదుస్తుల పంపిణీ చేశారు.

జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి సభాధ్యక్షులు మాట్లాడుతూ జిల్లాస్థాయి క్రిస్మస్ పండుగ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న దుస్తుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద క్రిస్మస్ వారి ఇంట్లో కూడా క్రిస్మస్ సందర్భంగా పేద వారి ఇంట్లో అయినా డబ్బున్న వారి ఇంట్లో అయినా సరే పండుగ అనేది ఉత్సాహంగా సంతోషంగా జరగాలి అని చెప్పి ప్రభుత్వం దుస్తుల పంపిణీ కార్యక్రమం తీసుకుంటూ వస్తుంది అందులో భాగంగా జిల్లా స్థాయిలో మంత్రి గారు చేతుల మీదుగా ప్రారంభించిన కుంటున్నాం
3 లేదా 4 ఈ రోజుల్లో జిల్లా లోని నియోజకవర్గాలలో దుస్తుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించు కొని ప్రతి ఒక్కరి ఇంట్లో క్రిస్మస్ వెలుగులు నింపాలి ప్రతి ఒక్కరు సంతోషంతో పండుగ జరుపుకోవాలి వీటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది పిల్లల చదువు పై మైనార్టీ వెల్ఫేర్ స్కూల్ ప్రారంభించు కోవడం జరిగింది అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు అందిపుచ్చుకొని మనం మన కుటుంబం అభివృద్ధి వైపు నడిచినప్పుడే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు యొక్క సార్ధకత జరుగుతుంది అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, లోన్స్ ఒక్కొక్క మెట్టు ఏ విధంగా ఎదగాలి ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వ ఉద్దేశం ప్రజలందరూ వారి కాళ్లపై వారు నిలబడేలా బ్రతికి స్థాయికి ఎదగాలని ఏసు క్రీస్తు ఆశీస్సు తో అందరూ సుఖ శాంతులతో
ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, ఎమ్మెల్సీ లు రాజేశ్వర్, విజీ గౌడ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ మోహన్, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, భీమ్గల్ ఎంపీపీ అధ్యక్షులు రాజ్యలక్ష్మి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్ కరుణ సురేందర్ జడ్పి కోఆప్షన్ సభ్యులు మొఈజ్ కార్పొరేటర్ మాణిక్యాల శ్రీనివాస్ మైనారిటీ వెల్ఫేర్ అధికారి రతన్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here