తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల స్థితిగతులు మెరుగుప‌ర‌చ‌డ‌మే సీఎం కెసిఆర్‌

0
217
Spread the love

రాష్ట్రంలో అనాథలు, అనాథ ఆశ్రమాలు, కరోనా వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లల స్థితిగతులు మెరగు పర్చే లక్ష్యంతో సీఎం కేసిఆర్ గారు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి అధ్యక్షతన వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నేపథ్యంలో నేడు మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా, పరిగిలోని బాల సదన్ ను సందర్శించి, అక్కడి వసతులను, పిల్లల ఆరోగ్య, విద్యా పరిస్థితులను పరిశీలించారు. సదన్ లో 29 మంది పిల్లలు ఉంటే దాదాపు ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఇంకా ఏమేమి వసతులు కల్పిస్తే బాగుంటుంది అని అడిగారు.

ఇద్దరు తల్లిదండ్రులు లేనివారు, తల్లి దండ్రులలో ఒకరిని కోల్పోయిన వారిని బాల సదన్ లో ఆశ్రయం ఇచ్చి, వారికి విద్యాభ్యాసం చేయిస్తున్నారు. వీరిలో చిన్న పిల్లల నుంచి 10వ తరగతి చదివే వరకు గల బాలికలు ఉన్నారు.

మంత్రులు, అధికారులు ఈ బాలికలు, పిల్లలలో మాట్లాడినప్పుడు తమ ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగుందని, బాగా చదువుకుంటున్నామని చెప్పారు. తాము పోలీస్, టీచర్ కావాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తమని తమ బంధువులు పట్టించుకోకున్నా, తల్లి దండ్రులలో ఎవరూ తమని చూడకున్నా ఇక్కడ తమను బాగా చూసుకుంటున్నారు అని వివరించారు.

మంత్రులు ఇద్దరూ పిల్లలని దగ్గరకు తీసుకొని, వారితో మాట్లాడారు. పిల్లలకు ఫ్రెండ్ షిప్ బాండ్స్ కట్టి ధైర్యం కల్పించారు.

సీఎం కేసిఆర్ గారు ఒక తండ్రి వలె గొప్ప మనసుతో ఆలోచించి మీకు విద్య, భోజనం, వసతితో పాటు ఇక్కడ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తరవాత మంచి భవిష్యత్ అందించాలన్న ఆలోచనతో ఉన్నారని, దేనికి దిగులు పడకుండా బాగా చదువుకోవాలని వారికి ప్రోత్సాహం కల్పించారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి కామెంట్స్….

సీఎం కేసిఆర్ గారు నిన్న కేబినెట్ సమావేశంలో కరోనా వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లలు, ఇతర అనాథల సంరక్షణ చేయాలని, వారికి గొప్ప భవిష్యత్ అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. అందులో భాగంగానే కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వాలన్నారు.

కరోనా వల్ల మన రాష్ట్రంలో 200 -250 మంది వరకు అనాథలు అయ్యారు.

కరోనా కాకుండా ఇతర కారణాల వల్ల దాదాపు 15వేల మంది వరకు రాష్ట్రంలో అనాథలు ఉంటారని అంచనా ఉంది.

వీరంతా ప్రభుత్వం నిర్వహిస్తున్న హోమ్స్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ సంస్థలలో ఉన్నారు.

వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వమే తల్లిదండ్రులుగా ఉండి, వారి భవిష్యత్ ను తీర్చిదిద్దాలి అనేది సీఎం కేసిఆర్ గారి సంకల్పం.

వీరి చదువు, భవిష్యత్ కోసం ఏం చేయాలి చెప్పడానికి కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు ఇవ్వాలి.

తల్లిదండ్రుల కంటే ఇక్కడ బాగా చూసుకుంటున్నారు అని చెప్పడంతో పిల్లలని చూసినప్పుడు సంతోషం కలిగింది.

సీఎం కేసిఆర్ గారు పెద్ద మనసుతో ఈ పిల్లల భవిష్యత్ కోసం గొప్ప ఆలోచన చేస్తున్నారు.

సమాజంలో అందరితో సమానంగా వీరూ ఉండేలా, వీరికి భద్రత కల్పించి మానసిక ధైర్యం ఇచ్చే విధంగా పాలసీ రాబోతుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనాథలకు మంచి భవిష్యత్ ఇచ్చే విధంగా ఈ కేబినెట్ సబ్ కమిటీ పని చేస్తుంది.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి కామెంట్స్…

నిన్న కేబినెట్ మీటింగ్లో సీఎం కేసీఆర్ గారు కరోనా వల్ల అనాథలు అయిన పిల్లల సంరక్షణకు, ఇతర అనాథలకు గొప్ప భవిష్యత్ ఇవ్వాలని చెప్పారు.

రాష్ట్రంలోని అనాథలు అందరినీ హక్కున చేర్చుకోవాలని నిర్ణయించారు. ఇంత మంచి మనసున్న సీఎం కేసిఆర్ గారికి వీరందరి తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు.

చదువుకోవడం, ఆ తరవాత కూడా మంచి భవిష్యత్ ఇచ్చే విధంగా చేయాలని చెప్పారు.

ఇక్కడ చెప్పే అభిప్రాయాలు సీఎం కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాము.

అమ్మ నాన్నల కంటే ఇక్కడే బాగుందనీ వారు చెప్తుంటే సంతోషం కలిగింది. ఇక్కడి పిల్లలకు గొప్ప లక్ష్యాలు ఉన్నాయి. వాటిని సాకారం చేసే విధంగా ఈ ప్రభుత్వం పని చేస్తుంది.

మంత్రులు, ప్రజా ప్రతినిధులుగా మీరు వ్యక్తిగతంగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకోండి అని సీఎం కేసిఆర్ గారు చెప్పారు.

ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి దివ్య దేవరాజన్, కలెక్టర్ శ్రీమతి పౌసమి బసు, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here