*న‌గ‌ర‌వాసుల‌కు అందుబాటులోకి రానున్న మీర్ ఆలం ట్యాంక్ పార్కు*

0
619
Spread the love


గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని ప్ర‌తి జోన్‌లో రెండు మేజ‌ర్ పార్కుల‌ను కొత్త‌గా అభివృద్ది చేయాల‌న్న జీహెచ్ఎంసీ కార్య‌క్ర‌మంలో భాగంగా చార్మినార్ జోన్‌లో కొత్త‌గా రూపొందించిన మీర్ ఆలం ట్యాంక్ చెరువు పార్కు శ‌నివారం నాడు న‌గ‌ర‌వాసుల‌కు అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్‌.కె.జోషి ఈ మీర్ ఆలం ట్యాక్ పార్కును శ‌నివారం సాయంత్రం ప్రారంభించ‌నున్నారు. దాదాపు రూ. 2.51 కోట్ల వ్య‌యంతో మీర్ ఆలం ట్యాంక్‌కు చింత‌ల్ మెట్ వైపు ఈ పార్కును స‌ర్వాంగ సుంద‌రంగా జీహెచ్ఎంసీ రూపొందించింది. హైదరాబాద్ – బెంగుళూరు రహదారి మధ్యలో ఉన్న మీర్ ఆలం ట్యాంక్ అనే సరస్సు నెహ్రు జూలాజికల్ పార్క్ కి అత్యంత సమీపంలో ఉంది. హుస్సేన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ లు నిర్మాణం కాక ముందు నుండే హైదరాబాద్ నివాసితులకి త్రాగు నీరు అలాగే వంట అవసరాల కోసం నీరు అందించేందుకు ఈ మీర్ ఆలం సరస్సు ఉపయోగపడేది. హైదరాబాద్ రాష్ట్రానికి అప్పటి ప్రధాని మంత్రిగా వ్యవహరించిన మీర్ ఆలం బహదూర్ చేత 1804 లో ఈ సరస్సు నిర్మించబడినది. హైదరాబాద్ మూడవ నిజాం అయిన మీర్ అక్బర్ అలీ ఖాన్ సికందర్ జాహ్ ఆసిఫ్ జాహ్ హయాంలో అతని చేత ఈ సరస్సు నిర్మాణమయింది. ఈ సరస్సుని నిర్మించడానికి దాదాపు రెండు సంవత్సరాలు. ఈ సరస్సు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. టిప్పు సుల్తాన్ పై యుద్ధం చెయ్యడానికి మీర్ ఆలం నిజాం బలగాలని పంపారు. టిప్పు సుల్తాన్ ని ఓడించిన తరువాత మీర్ ఆలం శ్రీరంగపట్నం నుండి తీసుకున్న ఖజనాతో ఈ సరస్సుని కట్టారని ప్ర‌తీతి. *చార్మినార్ జోన్‌లో రెండో అతిపెద్ద పార్కు*చార్మినార్ జోన్‌లో ఇమ్లీబన్ పార్కు అనంత‌రం మీర్ ఆలం పార్కు రెండో అతిపెద్ద పార్కుగా రూపొందింది. 6.5 ఎక‌రాల విస్తీర్ణంలో రూపొందించిన ఈ పార్కులో అర్బ‌న్ బ‌యోడైవ‌ర్సిటీ విభాగం ద్వారా  లైటింగ్‌, ద‌క్క‌న్ శైలీ పెయింటింగ్‌లు, ఓపెన్ జిమ్‌, పిల్ల‌ల ఆట వ‌స్తువులు, పౌంటెన్‌లు, మినీ సైన్స్ పార్కు, ద‌క్క‌న్ శైలీ శిల్పాల‌ను, చిత్రాల‌ను ఏర్పాటు చేశారు. పార్కు ప్ర‌వేశ ద్వారంలోనే ద‌క్క‌న్ శైలీ శిల్పాలు, చిత్రాల‌తో కూడిన ఎంట్రీ ప్లాజా ప్ర‌తిఒక్క‌రిని ఆక‌ట్టుకునేవిధంగా ఉంది. ఈ చెరువులో 6.8 కిలోమీట‌ర్ల వాకింగ్ ట్రాక్‌ను 8మీట‌ర్ల వెడ‌ల్పుతో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేశారు.*ప‌చ్చీసు, చెస్ క్రీడ‌ల న‌మూనాలు* ఈ మీర్ ఆలం ట్యాంక్‌లో చిన్న‌పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా ఆట వ‌స్తువులు ఏర్పాటు చేయ‌డంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ఆద‌ర‌ణ ఉన్న ప‌చ్చీసు ఆట మాదిరి,  చెస్ ఆట మాదిరి న‌మూనాల‌ను ఈ పార్కులో రూపొందించారు. పంచ‌త‌త్వ వాకింగ్ ట్రాక్ మ‌రో ఆక‌ర్ష‌నీయంగా ఉంది. మీర్ ఆలం ట్యాంక్‌ జూపార్కు వైపు ఉన్న ప్ర‌ధాన గేట్ వ‌ద్ద పెద్ద ఎత్తున పేరుకుపోయిన నిర్మాణ వ్య‌ర్థాలు, చెత్త‌ను పూర్తిగా తొల‌గించి పార్కు చుట్టూ మొక్క‌లు నాటడంతో పాటు పార్కులో ప్ర‌త్యేకంగా ఓపెన్ జిమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం ద్వారా మిరాలం చెరువు క‌ట్ట ప‌టిష్ట‌త‌, పెన్సింగ్ ఏర్పాటు, పాత్‌-వే, లైటింగ్‌, గ్రీన‌రి, బ్యూటిఫికేష‌న్ ప‌నుల‌ను చేప‌ట్టారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here