MLA Maganti Gopinath launches Ramaiah Ayurveda Clinic

0
451
Spread the love

MLA Maganti Gopinath launches Ramaiah Ayurveda Clinic in Association with Ayurmegha Research Labs

Hyderabad(Toofan News) Jubilee Hills MLA Maganti Gopinath Garu today inaugurated Ramaiah Ayurveda Clinic in Association with Ayurmegha Research Labs at Road No.12, Banjara Hills.

On this occasion, Prof.Dr GG Gangadharan said, Ramaiah Ayurmegha, Powered By Ayurmegha, started three decades ago in Bengaluru, has expanded to Madhya Pradesh and Malaysia. He said they were extending treatment to Acute and Chronic Ailments including Obesity Problems and especially Stress.

Managing Director of Ayurmegha Research Labs, Mr.Murty Chennubhotla said, Ayurmegha collaborating with Ramaiah Ayurveda, blended with Technology, would enhance the Quality of Ayurveda.

*******

ప్రజా జీవితంలో భాగం ఆయుర్వేదం

రామయ్య ఆయుర్వేద క్లినిక్ ప్రారంభ సభలో ఎమ్మెల్యే మాగంటి

Banjara Hills (Hyderabad) – ప్రజా జీవితంలో ఆయుర్వేదం భాగమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. బంజారాహిల్స్‌లో ఆయుర్ మెగా రీసెర్చ్ ల్యాబ్స్ భాగస్వామ్యం తో ఏర్పాటు చేసిన రామ‌య్య ఆయుర్వేద క్లీనిక్ ను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుతున్న నేటి ఆధునిక జీవనశైలి లో వస్తున్న కొత్త కొత్త వ్యాధుల నేపథ్యం లో భారతీయ సాంప్రదాయ వైద్యమైన ఆయుర్వేద వైద్యం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు. రామ‌య్య ఇండిక్ స్పెషాలిటీ ఆయుర్వేద డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ జీజీ గంగాధ‌ర‌న్ మాట్లాడుతూ మూడు దశాబ్దాల క్రితం బెంగళూరు లో ప్రారంభమైన తమ సంస్థ మధ్యప్రదేశ్, మలేషియాకు విస్తరించి రోగులకు నమ్మకమైన వైద్య సేవలు అందిస్తున్నదని అన్నారు. క్రానిక్ డిసీజ్, స్కిన్, ఒబేసిటీ తదితర వ్యాధుల తో పాటు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాల దీర్ఘకాలిక, మొండి వ్యాధులకు చికిత్స అందించనున్నట్టు తెలిపారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ టెలి వేద పేరుతో ఆన్ లైన్ కన్సల్టేషన్ ద్వారా రోగుల సందేహాలను నివృత్తి చేస్తున్నట్టు వివరించారు. క్లినిక్ ప్రారంభ ఆఫర్ల లో బాగంగా పెద్ద ఎత్తున డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నారాయణ సూర్యకుమార్, డాక్టర్ జె.క్రిష్ణ, గ్లోబల్ బిజినెస్ ఆపరేషన్ హెడ్ ప్రేమ్ భాస్కరన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here