నిధులు ఏమైనాయి.. ‘మా’ కమిటీ సభ్యులను నిలదీసిన బాలయ్య 

0
50
Spread the love

నిధులు ఏమైనాయి.. ‘మా’ కమిటీ సభ్యులను నిలదీసిన బాలయ్య 

హైదరాబాద్ జూలై 15 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు మాబిల్డింగ్‌ ఎందుకు కట్టలేకపోతున్నారని నిధులు ఏమైనాయని కమిటీ సభ్యులను నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు, మా భవనం కోసం అడిగితే ఒక ఎకరం ఇవ్వదా అని ఆయన ప్రశ్నించారు.గతంలో ఫండ్ రైజింగ్ పేరుతో మా సభ్యులు అమెరికా వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఫస్ట్ క్లాస్, టాప్ క్లాస్‌లో ఫ్లైట్‌లో అమెరికా వెళ్లిన చేసిన కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. మాబిల్డింగ్‌ నిర్మాణం కోసం ముందు కొస్తే, తాను సహకరిస్తానని చెప్పారు. అసోసియేషన్ ఎన్నికల్లో అర్టిస్టులు అందరూ సమానమేనన్నారు సినీ పెద్దలంతా కలిసి వస్తే.. ఇంద్రభవనం నిర్మించుకోవచ్చని బాలయ్య అన్నారు. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here