కుల‌మ‌తాల‌కు అతీత‌మైన స‌మాజ నిర్మాణమే ల‌క్ష్యం

0
45
Spread the love

కుల‌మ‌తాల‌కు అతీత‌మైన స‌మాజ నిర్మాణమే ల‌క్ష్యం
ఏక్ భార‌త్ – శ్రేష్ఠ భార‌త్ అవ‌గాహ‌న స‌ద‌స్సులో ఎమ్మేల్యే నోముల భ‌గ‌త్‌

హాలియా, డిసెంబ‌రు 23, 2021 : కులం, మ‌తం, ప్రాంతాల‌కు అతీతంగా స‌మాజ నిర్మాణంతోనే సంపూర్ణ‌, స‌మ‌గ్ర భార‌త్ సాధ్య‌మ‌ని నాగార్జున‌సాగ‌ర్ శాస‌న‌స‌భ్యులు నోముల భ‌గ‌త్ పేర్కొన్నారు. విద్యార్థులు, యువ‌త దేశ‌భ‌క్త‌ని పెంపొందించుకొని ఐక్య‌తా భావ‌న‌ను ముందుకు తీసుకుపోవాల‌ని పిలుపునిచ్చారు. ఐక్య‌త‌, అభివృద్ధితోనే భార‌త‌దేశం ప్ర‌పంచ‌ప‌టంలో అగ్ర‌స్థానంలో నిల‌బ‌డుతుంద‌ని వ్యాఖ్యానించారు. కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ‌శాఖ ప‌రిధిలోని ఫీల్డ్ ఔట్‌రీచ్ బ్యూరో, న‌ల్గొండ యూనిట్ గురువారం హాలియా ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల ప్రాంగ‌ణంలో ఏక్ భార‌త్ – శ్రేష్ఠ భార‌త్ అనే అంశంపై అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించింది. జిల్లా క్షేత్ర ప్ర‌చార అధికారి గుత్తా కోటేశ్వ‌ర్‌రావు అధ్య‌క్ష‌త వ‌హించిన ఈ స‌ద‌స్సుకు ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎమ్మెల్యే నోముల భ‌గ‌త్ మాట్లాడుతూ పౌరులందరి భాగస్వామ్యం, యువ‌త క్రమ శిక్షణతో నిల‌బ‌డ‌ట‌మే ఏక్ భార‌త్ – శ్రేష్ఠ భార‌త్ సాధ‌న‌గా పేర్కొన్నారు. దేశ స‌మైఖ్య‌త‌, స‌మ‌గ్ర‌త‌ను మ‌రింత పెంపొందించేందుకు అంద‌రూ కృషి చేయాల‌ని పిలుపునిచ్చార‌రు. విద్యాలయాలు దేశ సమగ్రత, అభివృద్ధికి పునాదులుగా ఉంటాయ‌న్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు, కష్టపడే తత్వం అలవరుచుకోవాల‌ని కోరారు. ఉన్నతమైన సంస్కృతి, సంప్రదాయాలను మరింత ముందుకు తీసుకుపో వాల్సిన బాధ్యత విద్యార్థులు, యువ‌త‌పై ఉందన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని మ‌తాలు, కులాలనూ స‌మానత్వంతో చూస్తోంద‌ని, స‌క‌ల జ‌నుల అభివృద్ధికి కృషి చేస్తోంద‌ని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్ల‌లో నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌ణాళికా యుతంగా ప‌నిచేస్తున్న‌ట్లు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మేల్యే స్వ‌యంగా త‌న విద్యార్థి జీవితాన్ని గుర్తుచేసుకుంటూ ఆ చ‌ల్ల‌ని స‌ముద్ర‌గ‌ర్భం పాట పాడి వినిపించారు. జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వర రావు మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం పాటు పడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్మరించుకుంటూ ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ పేరుతో అన్ని ప్రాంతాల ప్రజలలో పరస్పర అవగాహన, అనుబంధం పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల ప్రిన్సిపాల్ పి.ర‌వికుమార్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏక‌త్వం మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది అన్నారు. విభిన్న భాషలు, అలవాట్లు, సంస్కృతులు ఉన్నా ప్రజల మధ్య, రాష్ట్రాల మధ్య ఐక్యత మన దేశ సుసంపన్నతకు నిదర్శనం అన్నారు. విద్యార్థులు త‌మసొంత ప్రాంత సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను తెలుసుకొని కాపాడుకోవాల‌ని ప్ర‌భుత్వ క‌ళాశాల ప్రిన్సిపాల్ విజ‌య్ నాయ‌క్ కోరారు. కార్య‌క్ర‌మంలో హాలియా పుర‌పాల‌క సంఘం అధ్య‌క్షురాలు పార్వ‌త‌మ్మ శంక‌ర‌య్య, ఉపాధ్య‌క్షులు సుధాక‌ర్‌, క‌మిష‌న‌ర్ వేమ‌న‌రెడ్డి, ప్రాథ‌మిక స‌హ‌కార సంఘం ఉపాధ్య‌క్షులు శ్రీ‌నివాస‌రెడ్డి, కేజీబీవీ ప్ర‌త్యేకాధికారి హైమావ‌తి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా హాలియా పుర‌పాల‌క సంఘం క‌మిష‌న‌ర్ వేమ‌న‌రెడ్డి విద్యార్థుల‌తో స్వ‌చ్ఛ భార‌త్ ప్ర‌తిజ్ఝ చేయించారు. 

అవ‌గాహ‌న స‌ద‌స్సు సంద‌ర్భంగా వివిధ క‌ళాశాల‌ల విద్యార్థుల‌కు భార‌తదేశ ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌త అనే అంశాల‌పై క్విజ్‌, వ్యాస‌ర‌చ‌న పోటీలు నిర్వ‌హించారు. ఈ పోటీల‌లో విజేత‌ల‌కు ఎమ్మెల్యే నోముల భ‌గ‌త్ త‌న చేతుల మీదుగా మెరిట్ స‌ర్టిఫికెట్‌, ప్రైజ్‌లు అంద‌జేశారు. తెలంగాణ ప్రాంత ప్ర‌తిష్ఠ‌పై అద్భుత‌మైన పాట పాడి వినిపించిన కేజీబీవీ 9 వ త‌ర‌గ‌తి విద్యార్థిని సావిత్రిని ఆయ‌న శాలువాతో స‌త్క‌రించి బహుమ‌తి అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ జూనియ‌ర్, డిగ్రీ క‌ళాశాల అధ్యాప‌కులు, కేజీబీవీ, అల్ఫా జూనియ‌ర్ క‌ళాశాల అధ్యాప‌కులు, విద్యార్థులు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. విద్యార్థులు ప్ర‌ద‌ర్శించిన క‌ళారూపాలు ఆక‌ట్టుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here