ప్రజాసమస్యలు పరిష్కారానికి మీకోసం కార్య‌క్ర‌మం

0
140
Spread the love

ప్రజాసమస్యలు పరిష్కారానికి మీకోసం కార్య‌క్ర‌మం

మెదక్ – నియోజకవర్గ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీకోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 36 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 17 లక్షల రూపాయలు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా మీకోసం కార్యక్రమాన్ని ప్రతి నెల 2, 16 వ తేదీల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి మంచి అనూహ్యమైన స్పందన లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా భూతగాదాలు వికలాంగుల పింఛన్లు తదితర సమస్యలతో మీకోసం కార్యక్రమానికి వస్తున్నారని ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి వాటిని పరిష్కరిస్తున్నమని తెలిపారు. మీకోసం కార్యక్రమానికి 56 చరవాణి ద్వారా 154 మంది వినతి పత్రాల ద్వారా సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని సత్వరమే వీటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here