*మొబైల్ టాయిలెట్ల ప్రారంభం*          

0
62
Spread the love

*మొబైల్ టాయిలెట్ల ప్రారంభం*

*హైదరాబాద్, జూన్ 15 :*   గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధాన కూడళ్లు రద్దీ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ  కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు మొబైల్ టాయిలెట్లు పౌరులకు అందుబాటులో వచ్చాయి. నిరుపయోగ ఆర్టీసీ బస్సులను మోబైల్ టాయిలెట్లుగా రూపొందించి వీటిలో  ప్రత్యేకంగా స్రీలు, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లను ఏర్పాటు చేశారు మొట్టమొదటి సారిగా ట్రాన్స్ జెండర్స్ కు కూడా ఈ మొబైల్ టాయిలెట్లలో సౌకర్యం కల్పించారు. ఇప్పటికే ఈ విధమైన 30  మొబైల్ టాయిలెట్లు నగర వాసులకు అందు బాటులో ఉండగా ఖైరతాబాద్ జోన్ కు కేటాయించిన మరో కొత్త ఐదు మొబైల్ టాయిలెట్లను నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి లు నేడు ప్రారంభించారు. నెక్లెస్ రోడ్ లోని పార్కింగ్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ఈ ప్రారంభోత్సవం సందర్బంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, నగరంలోని రద్దీ ప్రాంతాల్లో , సభలు సమావేశాలు జరుగుతున్న ప్రాంతాల్లో ఈ మొబైల్ టాయిలెట్లను ఉపయోగించడం జరుగుతుందని అన్నారు. ఈ మొబైల్ టాయిలెట్లలో స్త్రీలకు రెండు, పురుషులకు ఒకటి, నాలుగు యూరినల్స్ లతోపాటు పాలిచ్చే మహిళలకు ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశామని వివరించారు. ఈ బస్సు వెనుక భాగంలో స్నాక్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ విక్రయానికి గాను చిన్న షాప్ ఏర్పాటుకు కూడా సౌకర్యం కల్పించామని అన్నారు. సోలార్ పవర్ విధానం కల్పించిన ఈ మొబైల్ టాయిలెట్ నిర్వహణను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కి ఇచ్చామని వివరించారు. ఈ కార్యక్రమంలో హైరతాబాద్ జోనల్ కమీషనర్ ప్రావీణ్య, మెడికల్ ఆఫీసర్ భార్గవ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here