ప్రజా సేవల్లో లంచాలు: ఆసియాలో అగ్రస్థానం భారత్‌దే.. అత్యధికంగా POLICE విభాగంలోనే

0
509
Spread the love

ప్రజా సేవల్లో లంచాలు: ఆసియాలో అగ్రస్థానం భారత్దే.. అత్యధికంగా POLICE విభాగంలోనే!

దేశంలో గడచిన 12 నెలలుగా అవినీతి పెరిగిందని నమ్ముతున్నట్టు ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. సర్వేలోని పాల్గొన్న 47 శాతం మంది ప్రజలు ఈ అభిప్రాయం వ్యక్తం చేయగా.. వీరిలో 63 శాతం మంది అవినీతిని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అభిప్రాయపడ్డారు. అయితే, ఆసియా ప్రాంతంలోని మిగతా దేశాలతో పోల్చితే భారత్‌లోనే అవినీతి ఎక్కువగా ఉంది.

అయితే, ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన సర్వే నివేదిక ప్రకారం.. ఆసియా ప్రాంతంలో అత్యధిక లంచం రేటు 39 శాతంతో భారత్ ముందు వరుసలో నిలవడం గమనార్హం. ప్రజా సేవలను పొందటానికి అత్యధికంగా 46 శాతం మంది వ్యక్తిగత సంబంధాలను ఉపయోగిస్తున్నట్టు తెలిపింది. వ్యక్తిగత పరిచయాలు ఉపయోగించకపోతే ప్రభుత్వ సేవలను పొందలేమని లంచం ఇచ్చిన దాదాపు 50 మందిలో 32 శాతం మంది పేర్కొన్నారు.

ఈ ఏడాది జనవరిలో దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన అవినీతి అవగాహన సూచిలో భారత్ 80వ స్థానంలో నిలిచింది. తాజాగా, Global Curruption Boro Meter పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో 17 ఆసియా దేశాల్లోని 20వేల మంది పాల్గొన్నారు. జనవరి-సెప్టెంబరు మధ్య నిర్వహించిన ఈ సర్వేలో అవినీతి విషయంలో ప్రజలకు ఎదురైన అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. పోలీస్, కోర్టు, ప్రభుత్వ ఆస్పత్రులు, ధ్రువీకరణ పత్రాలు, యుటిలీటులు సేకరణ ఈ ఆరు ప్రజా సేవల గురించి ప్రజల అభిప్రాయాలను సేకరించింది.

అత్యధికంగా పోలీసులు, ధ్రువీకరణ పత్రాలకు లంచం ఇస్తున్నట్టు 42 శాతం మంది వెల్లడించారు. వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే గుర్తింపు పత్రాలకు 42 శాతం, పోలీసులు 39 శాతం, కోర్టులు 38 శాతం మంది ఉపయోగిస్తున్నట్టు తెలిపారు.

ప్రజా సేవల్లో లంచం భారతదేశాన్ని పీడిస్తూనే ఉంది. సంక్లిష్టమైన బ్యూరోక్రాటిక్ ప్రక్రియ, అనవసరమైన నిబంధనలు, అస్పష్టమైన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లు పౌరులను అవినీతి నెట్‌వర్క్‌ల ద్వారా ప్రాథమిక సేవలను పొందటానికి ప్రత్యామ్నాయ పరిష్కారాలను అన్వేషించేలా ప్రేరేపిస్తున్నాయని నివేదిక వ్యాఖ్యానించింది. నివేదికలో ప్రతిబింబించే ఆందోళనకర సమస్య ఏమిటంటే.. అవినీతిని వ్యాప్తిని అరికట్టడానికి కీలకం.. భారతదేశంలో 63 శాతం మంది ప్రతీకారం తీర్చుకోవడం గురించి ప్రత్యేకించి ఆందోళన చెందారు.

జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సేవల కోసం పరిపాలనా ప్రక్రియలను క్రమబద్ధీకరించడం.. లంచం, స్వపక్షపాతాన్ని ఎదుర్కోవడానికి నివారణ చర్యలను అమలు చేయడం.. అవసరమైన ప్రజా సేవలను త్వరగా, సమర్థవంతంగా అందజేయడానికి వినియోగదారు స్నేహపూర్వక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెట్టడం అవసరం’ అని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ నొక్కి వక్కాణించింది.

కిందటి సంవత్సరంతో పోల్చితే ప్రజా సేవలను పొందడానికి దాదాపు ఐదుగురిలో ఒకరు (19 శాతం) లంచం చెల్లించడం.. దేశంలో ప్రభుత్వ అవినీతి ఒక పెద్ద సమస్య అని మూడొంతుల మంది అభిప్రాయపడ్డారని సర్వే గుర్తించింది. ఇది దేశ జనాభాలో సుమారు 836 మిలియన్ల ప్రజలకు సమానం. సర్వేలో పాల్గొనవారిలో దాదాపు 38 శాతం మంది గత పన్నెండు నెలల్లో దేశంలో అవినీతి పెరిగిందని, మరో 28 శాతం మంది అదే విధంగా ఉందని భావిస్తున్నారు.

నేపాల్, థాయ్‌లాండ్‌లో మెజారిటీ పౌరులు (వరుసగా 58%,55%) అవినీతి పెరిగిందని భావిస్తున్నారు. దీనికి విరుద్ధంగా చైనాలోని మెజారిటీ పౌరులు (64%), ఫిలిప్పీన్స్ (64 శాతం), కంబోడియా (55 శాతం) అవినీతి తగ్గినట్లు భావిస్తున్నారు నివేదిక ఉదహరించింది. లంచాల్లో భారత్ 39 శాతంతో తొలిస్థానంలో ఉండగా.. తర్వాత కాంబోడియా (37 శాతం), ఇండోనేషియా (30 శాతం) ఉన్నాయి. అత్యల్పంగా మాల్దీవులు, జపాన్ (2శాతం), దక్షిణ కొరియా (10 శాతం), నేపాల్ (12 శాతం) నిలిచాయి.

అప్పట్లో లంచానికి కేరాఫ్ గా పోలీసులే వున్నారని సాక్షాత్ అప్పటి డిజిపి మహేందర్ గారే వివరించారంటే అప్పటి పరిస్ధితి ఎంత భయంకరంగా వుందో , ఇప్పటికి అది వేళ్లూనుకుని వటవృక్షంగా మారి ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందో అంచనా వేయొచ్చు. అప్పటి లెక్కలు అంటే 2018లో మన పోలీస్ బాస్ బయటపెట్టిన జాబితాను మరోసారి పరిశీలిద్దాం.

తెలంగాణ పోలీసుశాఖలో 391 మంది ఖాకీలు డిపార్ట్‌మెంట్ నమ్మకాన్ని వమ్ము చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ఈ మీడియా సంస్థో లీక్ చేస్తే అంత తీవ్రంగా ఉండేది కాదేమో. సాక్షాత్తూ రాష్ట్ర పోలీస్ బాసే ఈ జాబితాను బయటపెట్టడం సంచలనంగా మారింది. కొంత మంది పోలీసు అధికారుల్లో కాళ్ల కింద భూకంపం వచ్చినంత పనైంది. ప్రత్యేక బృందాల ద్వారా నిఘా పెట్టి, సర్వేలు చేయించి డీజీపీ మహేందర్ రెడ్డి ఈ జాబితాను వెల్లడించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయా కమిషనరేట్లకు ఇ-మెయిల్ ద్వారా ఆదేశాలిచ్చారు.

తమ పైఅధికారుల కోసం కొంత మంది కింది స్థాయి పోలీసు అధికారులు తీవ్రమైన అవినీతి చర్యలకు పాల్పడుతున్నారు. డిపార్టుమెంట్ పరువు తీస్తున్నారు. పోలీసు స్టేషన్ల వారీగా అవినీతిపరులైన ఖాకీల జాబితాను డీజీపీ మహేందర్‌ రెడ్డి విడుదల చేశారు. స్టేషన్ల వారీగా 391 మంది పేర్లను ఈ జాబితాలో పేర్కొన్నారు.

అత్యధికంగా 40 మంది అవినీతి పోలీసులతో సూర్యాపేట ఈ జాబితాలో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో కరీంనగర్ (35), నిజామాబాద్ (29) ఉన్నాయి. రాచకొండలో 24 మంది, వికారాబాద్‌లో 27 మంది అవినీతి ఖాకీలు ఉన్నట్టు డీజీపీ కార్యాలయం తన నివేదికలో తెలిపింది. తక్షణమే వీరందరినీ ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేయాల్సిందిగా డీజీపీ ఆదేశించారు.

అవినీతిపరుల జాబితాలో అత్యధికంగా కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఉన్నారు. తమ పైఅధికారుల కోసం లంచాలు వసూలు చేస్తూ బలవుతున్నవారు అధికంగా ఉన్నారు. వైన్‌షాపులు, అనధికార బెల్టు షాపులు, కల్లు దుకాణందారులు, కొన్ని హోటళ్లు, రెస్టారెంటులు, పబ్‌ల నుంచి వీరు నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు.

కొంత మంది పోలీసు ఉన్నతాధికారులు అక్రమంగా పేకాట ఆడుతున్న జూదగాళ్ల నుంచి మామూళ్లు తీసుకుంటున్నారు. ప్రైవేట్ సెటిల్‌మెంట్లలో పాల్గొంటూ బిల్డర్లు, వ్యాపారవేత్తల నుంచి భారీ మొత్తం దండుకుంటున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తుల పట్ల చూసీచూడనట్టు వ్యవహరిస్తూ కొంత మంది పోలీసులు భారీగా డబ్బులు వెనకేసుకుంటున్నారు. వివిధ రకాల కేసుల్లో వ్యక్తులను తప్పిస్తూ కొంత మంది లంచాలకు పడగెత్తారు. కొన్ని పోలీస్‌స్టేషన్లకైతే నెల తిరగ్గానే ఠంచనుగా మామూళ్లు వస్తుండటం విస్తుగొలిపే అంశం. ఓ మహిళా ఎస్సై తరఫున ఆమె డ్రైవర్ లంచాలు వసూలు చేస్తున్నాడు.

మొన్నటికి మొన్న కాపాడే పొజిషన్ లో వుండాల్సిన ఎసిపి, డిఎస్ పి లే కోట్లకు కోట్లు లంచాలు మెక్కేస్తూ, ప్రభుత్వ భూములనే మింగేసిన సంఘటనలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి.

ఈ లంచాలకు అడ్డుకట్ట పడాలంటే ఏం చేయాలి? పోలీస్ వ్యవస్ధలో పైకి కనపడే మంచివాళ్లంతా లంచాలకు అలవాటు పడి, లంచం లేనిదే పని చేయలేని పరిస్ధితిలో వున్నారనే విషయం స్వయంగా పెద్ద తలకాయలకు తెలిసినా ఎవరూ ఏమీ చేయలేని పరిస్ధితి.

భారతీయుడు movie లో కమల్ హసన్ క్యారెక్టర్ ప్రతి ఒక్కరూ మారినప్పుడే దేశానికి ఏమైనా మంచి జరగొచ్చు. ఈ లంచాల వ్యవహారంలో సి.ఎం. కె.సి.ఆర్ ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా అని అంటున్నారే కానీ, ఏ విషయంలో చర్యలు తీసుకుంటున్నారు, ఎవరి మీద తీసుకుంటున్నారు అనేది ఎవరికీ తెలీదు. అసలు పోలీస్ వ్యవస్ధనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here