తను ఆరిపోతూ మనల్ని అందలం ఎక్కిస్తుంది అమ్మ

0
282
Spread the love

తల్లి లాలన..💐💐

నవ్వుతూ నవమాసాలు మోసి జన్మనిచ్చి ప్రపంచానికి పరిచయం చేస్తుంది అమ్మ…

ఆరుబయట లాలపోస్తూ వెలుగుకిరణాలని చూపిస్తుంది అమ్మ…

నా బంగారుకొండ ,వెండికొండ అంటూ కాటుక పెట్టీ దిష్టి తీస్తుంది అమ్మ…

చక్కిలిగింతలు పెడుతూ మన చెక్కిల్లలో నవ్వులు కురిపిస్తుంది అమ్మ

తన ఎర్రని రక్తాన్ని తెల్లని పాలగా మార్చి మన కడుపు నింపుతుంది అమ్మ..

జోల పాడి నిద్రపుచ్చి మన కునుకుకి రామబంటూలా కాపలా ఉంటుంది అమ్మ..

అరిపాదాలని ముద్దాడుతూ తన అమ్మతనానికి మురిసిపోతుంది అమ్మ..

చంకనేసుకొని చందమామని చూపిస్తూ గోరుముద్దలు పెడుతుంది అమ్మ..

వెక్కి వెక్కి ఏడ్చినప్పుడు తన పైట కొంగుతో కన్నీటికి ఆనకట్ట వేస్తుంది అమ్మ..

చీకటికి భయపడితే చిటికన వేలు పట్టుకొని నడిపిస్తుంది అమ్మ..

దాగుడుమూతలు ఆడిస్తూ మన భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తుంది అమ్మ..

తను ఆరిపోతూ మనల్ని అందలం ఎక్కిస్తుంది అమ్మ

నువ్వు మమ్మల్ని “ప్రేమ ఒడి”లో
లాలిస్తే మేము నిన్ను అనాధ గోడల్లో ఉంచుతున్నాము..

మేమే కదా నిజమైన ముద్దాయిలం
నువ్వు శిక్షించలేని బిడ్డలం..
పట్టుపడని నేరస్తులం

ఎందుకంటే
నీది ప్రేమబంధం కాదు పేగు బంధం..
నువ్వు ఒక బంధాలమాలవి
అనుబంధాల హారానివి..
చిరునవ్వుల వానజల్లువి..
సేదతీరని నీటి చుక్కవి ..
విశ్రాంతి లేని శ్రమ జీవివి..
ఇంటింటా ఆనందపు రంగులు వెదజల్లే ఇంద్రధనుస్సు అమ్మ..
రాయిని పూజించే మనసున్న మాకు అమ్మని ప్రేమించే గుణము లేదాయే…..

తన బిడ్డల్ని లాలిస్తూ…ప్రేమిస్తూ…అంతకుమించి క్షమిస్తూ ఉండే “మాతృమూర్తులకు”
శతకోటి వందనాలు…🙏🙏🙏💐💐💐

……………తుమ్మల కల్పనా రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here