పార్టీ మారే ఆలోచన లేదు.. అభివృద్దే నా అజెండా 

0
90
Spread the love

పార్టీ మారే ఆలోచన లేదు.. అభివృద్దే నా అజెండా 

       కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్ జూలై 12 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );తాను కాంగ్రెస్ లో ఉంటానని.. పార్టీ మారే ఆలోచన లేదని  కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు.తన దృష్టిలో పీసీసీ అధ్యక్ష పదవి చాలా చిన్నదని అన్నాడు. కాంగ్రెస్ ను ముందుకు నడిపే సమర్థమైన నేత లేరని.. రేవంత్ రెడ్డి చిన్నపిల్లవాడని.. ఆయన గురించి నా దగ్గర మాట్లాడొద్దు అని స్పష్టం చేశారు. రాజకీయాలపై మాట్లాడనని గతంలోనే చెప్పానని.. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ప్రజా సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతానని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇక నుంచి తాను గాంధీభవన్ మెట్లు ఎక్కనని.. తన నియోజకవర్గం జిల్లాకే పరిమితం అవుతానని కోమటిరెడ్డి స్పష్టం చేశాడు. హుజూరాబాద్ లో రాబోయే ఎన్నికల్లో కొత్త కార్యవర్గం కనీసం డిపాజిట్లు తెచ్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా టీటీడీపీ మాదిరిగానే మారబోతోందని వ్యాఖ్యానించారు. పీసీసీని ఇన్చార్జి అమ్ముకున్నారని.. త్వరలోనే ఆధారాలతో బయటపెడుతానని కోమటిరెడ్డి ఆరోపించారు. టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిందని విమర్శించారు. ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగినట్టు తనకు ఢిల్లీ వెళ్లాక తెలిసిందన్నారు. ఇక తాను మాత్రం సోనియాగాంధీ రాహుల్ గాంధీలపై విమర్శలు చేయనని.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం దూరంగా ఉంటానని కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.రేవంత్ కు ప్రధాన పోటీదారుగా నిలబడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు పీసీసీ దక్కకపోవడంపై అసంతృప్తితో రగిలిపోతున్నాడు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ అప్పగించడంపై జీర్ణించుకోలేకపోతున్నాడు.కోమటిరెడ్డి అసంతృప్తి జ్వాల ఇంకా చల్లారడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here