తనపై అనర్హత వేటు సాధ్యం కాదు: రఘురామకృష్ణంరాజు 

0
85
Spread the love

తనపై అనర్హత వేటు సాధ్యం కాదు: రఘురామకృష్ణంరాజు 

న్యూ డిల్లీ జూన్ 12 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ); తనపై అనర్హత వేటు సాధ్యం కాదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.ఢిల్లీలోఇటీవల ఎంపీ రఘురామ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని.. ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఇకసీఎం జగన్ ఢిల్లీలో ఉండడంతో ఆయన కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది.ఈ పరిణామాలపై తనను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీల తీరుపై రఘురామకృష్ణంరాజు  స్పందించారు తనపై అనర్హత వేటు సాధ్యం కాదని.. పార్టీకి విరుద్ధంగా వ్యవహరించలేదని రఘురామ క్లారిటీ ఇచ్చారు. ఏ పార్టీతోనూ జత కట్టలేదని.. పథకాల అమలులో లోపాలను మాత్రమే ప్రస్తావించానని చెప్పారు.కొంత మంది తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశానని.. వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయని రఘురామ వివరణ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here