వృక్ష వేదం పుస్తకాన్ని రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు అంద‌జేసిన ఎంపీ సంతోష్‌

0
142
Spread the love
వృక్ష వేదం పుస్తకాన్ని రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు అంద‌జేసిన ఎంపీ సంతోష్‌
 
హైదరాబాద్ నగర పర్యటనకు విచ్చేసిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ గారిని కలిసి సన్మానించి “వృక్ష వేదం” పుస్తకాన్ని అందజేసిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఈ సందర్భంగా దేశ్ దీపక్ వర్మ గారికి సంతోష్ గారు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో  జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు గురించి వివరించడం జరిగింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం లాంటి కార్యక్రమాలు దేశానికి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం జరిగిందని తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశం మొత్తం అమలుచేయాలని రాజ్యసభలో కోరడం నేను కూడా విన్నానని ఇలాంటి కార్యక్రమాలు దేశం మొత్తం అమలు చేయడం జరుగుతుందని  అందుకు ఉదాహరణ “జల్ జీవన్ మిషన్” పథకమే అని అని  తెలపడం జరిగింది.   తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు  గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని ముఖ్యంగా రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని నగరంలో పర్యటించినప్పుడు చాలా పచ్చదనం కనిపించిందని హైదరాబాద్ నగరం బాగా అభివృద్ధి చెందుతుందని తనతో  మాట్లాడినప్పుడు కొనియాడారు అని సంతోష్ కుమార్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, TRSLP కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here