ఎమ్మెల్సీ కవిత కు ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని అందజేసిన ఎంపీ జోగినిపల్లి సంతోష్..

0
191
Spread the love

ఎమ్మెల్సీ కవిత కు ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని అందజేసిన ఎంపీ జోగినిపల్లి సంతోష్..

తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని ఈరోజు ఎమ్మెల్సీ కవితకు అందజేశారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్

తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని ఎమ్మెల్సీ కవితకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అందచేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‏లో భాగంగా తెలంగాణలో ఉన్న అడవులు మరియు చెట్లకు సంబంధించి వేదాలలో ఉన్న విషయాలను తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ పుస్తకాన్ని ప్రచురించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. వృక్షవేదం పుస్తకం చాలా అద్బుతంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న అడవులు, ప్రకృతి అందాలను ఎంతో అద్బుతంగా చూపించారని తెలిపారు. పర్యావరణ ప్రేమికులకు ఈ పుస్తకం ఎంతో ఆనందాన్ని ప్రజల్లో పచ్చదనం పట్ల చైతన్యాన్ని తీసుకువస్తుందని తెలిపారు. వృక్ష వేదం పుస్తకాన్ని అద్బుతంగా రూపొందించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత అభినందనలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here