MSME వారి ద్వారా యువతకు ఉచిత శిక్షణ

0
316
Spread the love

MSME వారి ద్వారా యువతకు ఉచిత శిక్షణ

హైదరాబాద్, ఫిబ్రవరి 8, 2022 (Toofan) – భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, వారి సౌజన్యంతో ఎస్.సి, ఎస్.టి హబ్ పథకం క్రింద ఈ క్రింది వృత్తులలో ఉచిత శిక్షణను షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల యువతకు హైదరాబాద్ యూసఫ్ గూడలోని ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ క్యాంపస్ లో శిక్షణ నిర్వహించనున్నారు. ఈ ఉచిత శిక్షణా కార్యక్రమానికి 18 నుండి 35 సంవత్సరములు గల ఎస్.సి, ఎస్.టి యువతీ యువకుల నుండి దరఖాస్తులను అహ్వనిస్తున్నారు .

1. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ (350 గంటల కోర్సు, విద్యార్హత ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి)

2. సేల్స్ మేనేజర్ (550 గంటల కోర్సు, విద్యార్హత ఏదేని డిగ్రీ ఉండాలి)

3. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ (300 గంటల కోర్స్, విద్యార్హత బిటెక్ / ఎమ్.బి.ఎ)

4. కమ్యూనికేషన్స్, సాఫ్ట్ స్కిల్స్ (120 గంటల కోర్స్, విద్యార్హత ఎస్.ఎస్ సి/10వ తరగతి)

5. సేల్స్ & ప్రీసేల్స్ ఎనలిస్ట్ (400 గంటల కోర్స్, విద్యార్హత ఏదేని డిగ్రీ )

అర్హత, ఆసక్తి కలిగిన ఎస్.సి, ఎస్.టి యువతీ యువకులు ఈ కింది లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

http://Link :https://forms.gle/JAvDnRnnsKsQaAKN8

 

మరిన్ని వివరాల కోసం: info@nimsme.org , www.nimsme.org వెబ్ సైట్ , 040-23633258, 9493923498 ఫోన్ నెంబర్ లను అభ్యర్థులు సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here