నూతన స్టార్ట్-అప్ ల – నిధుల సేకరణ అంశంపై వెబినార్

0
195
Spread the love

నూతన స్టార్ట్-అప్ ల – నిధుల సేకరణ అంశంపై
ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ (NI-msme) వెబినార్

హైదరాబాద్, జులై 1, 2021 – నిరుద్యోగ యువ‌తీ యువ‌కుల ఉపాధి క‌ల్ప‌నే ధ్యేయంగా కేంద్ర ప్ర‌భుత్వం ఎమ్ఎస్ఎమ్ఇ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో యూస‌ఫ్ గూడ సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల జాతీయ సంస్థ‌ (ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ) అనేక కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. ఇందులో భాగంగా ఉస్మానియా టిబిఐ, బ్యాక్ ఆఫ్ బ‌రోడా స‌హ‌కారంతో నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ మైక్రో స్మాల్ అండ్ మీడియ‌మ్ ఎంట‌ర్‌ప్రైజెస్ 2021 జులై 6వ తేదీన కొత్తగా స్టార్ట్-అప్ లు ప్రారంభించాల‌నుకొనే వారి కోసం నిధుల సేకరణపై వెబినార్ నిర్వ‌హిస్తోంది. ఈ వెబినార్ లో నూత‌న స్టార్ట్-అప్ ల‌ను ప్రారంభించే విధానం, స్టార్ట్-అప్ ల న‌మోదు ప్ర‌క్రియ‌, బ్యాంక్ కు స‌మ‌ర్పించే ప్రాజెక్టు రిపోర్టు త‌యారీ, స్టార్ట్-అప్ ల కోసం నిధుల సేక‌ర‌ణ వంటి అనేక విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌లిగిస్తారు. బ్యాంక్ ఆఫ్ బ‌రోడా స‌హ‌కారంతో ఎమ్ఎస్ఎమ్ఇ 2021 జులై 8న యూస‌ఫ్‌గూడ లోని ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ (NI-msme) క్యాంపస్ లో లోన్ మేళాను నిర్వ‌హిస్తోంది. వెబినార్ రిజిస్ట్రేష‌న్, ఇత‌ర వివ‌రాల కోసం జి. సుద‌ర్శ‌న్‌, మొబైల్ నెంబ‌ర్: 9494959108 ను సంప్ర‌దించ‌గలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here