15న, ముంబైలో…. ఎం.ఎస్.యు.డబ్ల్యూ.జే మహాసభ

0
72
Spread the love

15న, ముంబైలో…. ఎం.ఎస్.యు.డబ్ల్యూ.జే మహాసభ

Toofan – మహారాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రథమ మహాసభ ఈ నెల 15న ముంబైలో జరగనున్నట్లు ఆ రాష్ట్ర యూనియన్ వ్యవహారాల ఇంచార్జ్, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఎం.ఎస్.యు.డబ్ల్యూ.జె రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గుండారి, ప్రమోద్ వామన్ ఖరత్ లు సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈస్ట్ దాదర్ లోని కోహినూర్ హోటల్ కాన్ఫరెన్స్ హాలులో జరగనున్న ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర పట్టణాభివృద్ధి, ప్రజా పనుల శాఖల మంత్రి ఎక్నాథ్ షిండే, రాష్ట్ర గృహ నిర్మాణం, మైనారిటీ సంక్షేమం, వక్ఫ్ బోర్డు శాఖల మంత్రి జితేంద్ర అహ్వాద్ లు హాజరవుతున్నట్లు వారు తెలిపారు.

గౌరవ అతిథిగా రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కుమారి అదితి సునీల్ తత్కరే, విశిష్ట అతిథులుగా మహారాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత ప్రవీణ్ డరేకర్, ఆం.ప్ర.ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్ రెడ్డి, బలవిందర్ సింగ్ జమ్ము, ఆత్మీయ అతిథులుగా ముంబై తెలుగు కళాసమితి ప్రధాన కార్యదర్శి యం.కొండారెడ్డి, ఆత్మ నిర్బర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు రంజిత్ చతుర్వేదిక్ పాటక్, రాజగిరి ఫౌండేషన్ అధ్యక్షులు అశోక్ రాజగిరి, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎం.ఏ.మాజీద్, టీయుడబ్ల్యుజె అధ్యక్షులు నగునూరి శేఖర్, ముంబై ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుర్భిర్ సింగ్ లు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఈ మహాసభకు ముంబై నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి జర్నలిస్టులు హాజరవుతున్నట్లు వారు పేర్కొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here