ప్ర‌ధాన మంత్రి తో భేటీ అయిన చిత్ర మ‌రియు వినోద ప‌రిశ్ర‌మ ప్ర‌తినిధివ‌ర్గం

0
988
Spread the love

ప్ర‌ధాన మంత్రి తో భేటీ అయిన చిత్ర మ‌రియు వినోద ప‌రిశ్ర‌మ ప్ర‌తినిధివ‌ర్గం

చిత్ర మ‌రియు వినోద ప‌రిశ్ర‌మ ప్ర‌తినిధివ‌ర్గమొకటి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని నేడు ముంబ‌యి లో కలుసుకొంది. ఈ ప్ర‌తినిధివ‌ర్గం లో వినోద ప‌రిశ్ర‌మ లోని నిర్మాత‌ లు, ఇంకా కంపెనీల సిఇఒ లు ఉన్నారు.

భార‌త‌దేశాన్ని స‌మీప భ‌విష్య‌త్తు లో అయిదు ట్రిలియ‌న్ డాల‌ర్ విలువ గ‌ల ఆర్థిక వ్య‌వ‌స్థ గా రూపొందించాల‌న్న ప్ర‌ధాన మంత్రి దార్శ‌నిక‌త కు ప్ర‌తినిధి వ‌ర్గం త‌న బలమైన మ‌ద్ద‌తు ను ప్రకటించింది. భార‌త‌దేశం లో వినోద ప‌రిశ్ర‌మకు, ప్ర‌సార మాధ్య‌మాల కు అపార‌ వృద్ధి అవ‌కాశాలు ఉన్నట్టు ప్రతినిధివర్గ సభ్యులు వివ‌రించారు; ఈ రంగం ప్ర‌భుత్వ దార్శనికత సాధన దిశ‌ గా చెప్పుకోద‌గిన రీతి లో తోడ్పాటు ను అందించ‌డానికి సిద్ధంగా ఉంద‌ని కూడా వారు పేర్కొన్నారు.

భార‌త‌దేశం లో వినోద ప‌రిశ్ర‌మ కు త‌క్కువ స్థాయి క‌లిగిన మ‌రియు ఒకేవిధమైన జిఎస్ టి రేటు లు ఉండాల‌ని ప్ర‌తినిధివ‌ర్గం విజ్ఞ‌ప్తి చేసింది.

వివిధ కార్య‌క్ర‌మాలు, క్రియాశీల విధానాల ద్వారా ముంబ‌యి ని ప్ర‌పంచ వినోద రాజ‌ధాని గా తీర్చిదిద్దాల‌ని ప్ర‌తినిధి వ‌ర్గం స‌భ్యులు గ‌ట్టి గా కోరారు.

భార‌తీయ వినోద ప‌రిశ్ర‌మ ప్ర‌పంచ వ్యాప్తం గా బ్ర‌హ్మాండ‌మైన ప్రజాద‌ర‌ణ‌ ను క‌లిగివుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ప్ర‌పంచం లో భార‌త‌దేశం సాఫ్ట్ పవర్ స్థాయి కి ఎదిగేందుకు కార‌ణం అయ్యే కీల‌క‌ మూల‌కాల‌లో భార‌తీయ వినోద ప‌రిశ్ర‌మ ఒక‌టి అని కూడా ఆయ‌న అన్నారు. వినోద ప‌రిశ్ర‌మ కు మ‌రియు ప్ర‌సార మాధ్య‌మాల‌ కు కేంద్ర ప్ర‌భుత్వం స‌హాయ‌ కారి గా ఉంటోంద‌ని; సూచ‌నల ప‌ట్ల సానుకూల ప‌రిశీల‌న జ‌రుపుతామ‌ని ప్ర‌తినిధివ‌ర్గానికి ఆయన హామీ ని ఇచ్చారు.

ఈ స‌మావేశం లో పాలుపంచుకొన్న వారిలో శ్రీ అక్ష‌య్ కుమార్‌, శ్రీ అజ‌య్ దేవ్ గ‌ణ్‌, శ్రీ రాకేశ్ రోశన్‌, శ్రీ ప్ర‌సూన్ జోశీ, శ్రీ క‌ర‌ణ్ జౌహర్ ల‌తో పాటు శ్రీ సిద్ధార్థ రాయ్ క‌పూర్, త‌దిత‌రులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here