కోకాపేట్ లో మున్నూరు కాపుల ఆత్మగౌరవ భవనానికి భూమి పూజ

0
100
Spread the love

కోకాపేట్ లో మున్నూరు కాపుల ఆత్మగౌరవ భవనానికి భూమి పూజ

ఐదు ఎకరాలు ఐదు కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం

మున్నూరు కాపుల ఆత్మగౌరవం ప్రతిఫలించేలా ఆరు అంతస్థుల 6 టవర్ల భవన నిర్మాణాలకు సంకల్పం

హాజరైన మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నేతలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణంలో మరో ముందడుగు పడింది, ఈరోజు మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజల సమక్షంలో హైదరాబాద్ లోని కోకాపేటలో ఆత్మగౌరవ భవనానికి భూమి పూజ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు భూమి పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మున్నూరు కాపు ఆత్మ గౌరవం కోసం ప్రభుత్వం కోకాపేట్ లోని అత్యంత ఖరీదైన ఐదు ఎకరాల భూమి, ఐదు కోట్ల రూపాయలను కేటాయించిన సంగతి విదితమే, ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటుతో పాటు మున్నూరు కాపులు సంఘటితమై దాదాపు 125 కోట్ల వ్యయంతో ఆరు అంతస్తుల అత్యాధునిక ఆరు టవర్లను నిర్మించాలని సంకల్పంతో ఉన్నారు మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు. ఇందులో విద్యార్థుల వసతి గృహాలు, లైబ్రరీ, ఆడిటోరియం సుదూర ప్రాంతాల నుండి హైదరాబాద్ వచ్చే మున్నూరు కాపులకు వసతి, డార్మెటరీ, భోజనశాల, మల్టీపర్పస్ హాల్ ఇతర రిక్రియేషన్ ఏర్పాట్లను చేయబోతున్నారు. ముఖ్యంగా రైతుబిడ్డ లైన మున్నూరు కాపుల ఆత్మ గౌరవం ప్రతిఫలించేలా డిజైన్లను రూపొందించామన్నారు నేతలు.
పూజా కార్యక్రమాల అనంతరం 11 గంటల నుండి అదే ప్రాంగణంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు మున్నూరు కాపు సంఘం నేతలు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి మున్నూరు కాపు సోదరులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని వారందరికీ భోజనంతో పాటు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తోపాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ దండె విఠల్, కార్పొరేషన్ల చైర్మన్లు వి ప్రకాష్, ఆకుల లలిత, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య, కన్వీనర్ పుట్టం పురుషోత్తమరావు, కాచిగూడ మున్నూరుకాపు మహాసభ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి నేతలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ కోఆర్డినేటర్ లు మున్నూరు కాపులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here