“భారతదేశంలో మ్యూజియంల రీ ఇమేజినింగ్‘‘ పై ఫిబ్రవరి 15 – 16 తేదీలలో హైదరాబాద్ లో మొదటి గ్లోబల్ సమ్మిట్

0
71
Spread the love

“భారతదేశంలో మ్యూజియంల రీ ఇమేజినింగ్‘‘ పై ఫిబ్రవరి 15 – 16 తేదీలలో హైదరాబాద్ లో మొదటి గ్లోబల్ సమ్మిట్

Hyderabad, 4 ఫిబ్రవరి,(Toofan)  ఒక దేశ వారసత్వాన్ని, విజ్ఞాన సంప్రదాయాలను, విలువలను పెంపొందించడంలో సాంస్కృతిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి సంస్థలలో మ్యూజియంలు ఆడియో-విజువల్ మార్గాల ద్వారా దేశ సుసంపన్న వారసత్వాన్ని సంరక్షించీ, డాక్యుమెంట్ రూపం లో భద్ర పరచి ప్రదర్శించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నాయి. అవి వ్యక్తులు , కమ్యూనిటీల మధ్య సంభాషణలను కూడా సులభతరం చేస్తాయి, ఇది నేటి విభిన్న సాంస్కృతిక విధానాలతో నిమగ్నం కావడానికి దోహదపడుతుంది. ఈ సందర్భంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2022 ఫిబ్రవరి 15-16 తేదీలలో “హైదరాబాద్ లో భారతదేశంలో మ్యూజియంలను తిరిగి ఊహించడం” పై మొట్టమొదటి గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఈ సదస్సు మన మ్యూజియంల నిర్వహణ, అభివృద్ధి గురించి చర్చించడానికి భాగస్వాములందరికి అపారమైన అవకాశాలను కల్పించనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభమవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here