సాగర్‌ ఉప ఎన్నికల బరిలో 41 మంది అభ్యర్థులు

0
198
Spread the love

సాగర్‌ ఉప ఎన్నికల బరిలో 41 మంది అభ్యర్థులు

నల్లగొండ ఏప్రిల్ 3 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. శనివారం 19 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.మొత్తం 77 మంది నామినేషన్లు వేయగా. 17 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మరో 19 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.దీంతో ఉప ఎన్నిక బరిలో 41 మంది ఉన్నట్లు రిటర్నింగ్‌ అధికారి, మిర్యాలగూడ ఆర్డీఓ రోహింత్ సింగ్‌ తెలిపారు. నెల 17న ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనుండగా.. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం ప్రకటించనున్నారు.ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here