జాతీయ జెండాను ఎగురవేసిన నంద‌మూరి బాల‌కృష్ణ‌

0
89
Spread the love

జాతీయ జెండాను ఎగురవేసిన నంద‌మూరి బాల‌కృష్ణ‌

నేడు 76 వ భారత స్వాతంత్ర్య దినోత్సవంతో పాటూ స్వతంత్య్ర‌ భారతావని 75 సంవత్సరములు పూర్తి చేసుకొని వజ్రోత్సవాలను నిర్వహించుకొంటున్న సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా నేటి ఉదయం హాస్పిటల్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాలాపనతో జెండా వందన చేశారు.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారు మాట్లాడుతూ నేడు భారత ప్రజలు పీల్చుకొంటున్న స్వేఛ్చావాయువులు ఎందరో మహానుభావుల త్యాగఫలమన్నారు. మహాత్మా గాంధీ, నేతాజీ, పింగలి వెంకయ్య, వావిలాల గోపాల కృష్ణ వంటి ఎందరో మహానుభావులు ఈ దేశానికి స్వాతంత్ర్యం సిద్దించడానికి విశేష కృషి చేశారన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం మనకు భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ మనం అందరం ఒక్కటే అన్న భావన నింపుతోందంటూ మన స్వాతంత్ర్య సిద్ది కోసం పోరాడిన మహానుభావులందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

గడిచిన 75 సంవత్సరాలలో భారత దేశం ప్రపంచ పటంలో అగ్ర స్థానంలో నిలిచే దశకు చేరుకుందని, తిండి లేక భాదపడిన మన దేశం ఇపుడు 145 దేశాలకు ఆహార ధాన్యాలు అందించే స్థాయికి చేరుకొందని శ్రీ బాలకృష్ణ అన్నారు. విద్య, వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోగతి సాధింఛామని చెప్పారు. దేశంలోనే కాదూ ప్రపంచ శాంతి కోసం నేడు భారత్ విశేష కృషి చేస్తోందని పేర్కొన్నారు. అయితే 75 సంవత్సరములలో ఎంతో పురోగతి సాధించినా ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని ఈ దిశగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని సూచించారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థములకు బానిస కావడం తద్వారా వారు సరైన మార్గంలో పయనించలేకపోవడంతో దేశం తిరోగమనంలో పయనించే పరిస్థితి ఉందని హెచ్చరించారు. దీంతో పాటూ నానాటికీ పెచ్చరిల్లుతున్న అవినీతి పై ప్రతి ఒక్కరూ తమ తమ పరిథిలో రాజ్యాంగబద్దంగా, నీతి నిజాయితీలతో పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఈ సందర్భంగా తన తల్లి తండ్రుల స్మృతి తో నడుస్తున్న ఈ హాస్పిటల్ కు సేవ చేసే భాగ్యం కలగడం పూర్వజన్మసుకృతమని అంటూ నా వంతుగా క్యాన్సర్ రోగుల స్వాంతన చేకూర్చడంతో పాటూ క్యాన్సర్ పై పోరాడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. కోవిడ్ మహమ్మారిలో పోరాడిన వైద్యులకు, హాస్పిటల్ సిబ్బందికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ అందరికీ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు మరియు 76 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 

అనంతరం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హాస్పిటల్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో శ్రీ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా ముందుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో విశిష్ట అతిథిగా పాల్గొన్న భారతీయ నౌకా దళానికి చెందిన మాజీ సీనియర్ అధికారి వైస్ అడ్మిరల్ (రిటైర్డ్) KASZ రాజు, PVSM, AVSM,NM గారిని బాలకృష్ణ సన్మానించారు.

అనంతరం సినీ సంగీత కళాకారులు బుర్రా విఖ్యాత్ సాయిరాం, హృతికా ఆనంది, కళ్యాణ్ వసంత్, యశస్విని లు పలు దేశ భక్తి గేయాలని ఆలపించారు. వీరికి తబలా పై సంతోష్, సితార్ పై నందగోపాల్, వీణ పై సాయి ప్రసాద్ రాజు, వయిలిన్ పై హేమంత్ కశ్యప్, ప్యాడ్స్ పై విజయ్ మరియు కీ బోర్డు పై వెంకటేష్ తదితరులు వాద్య సహకారాన్ని అందించారు. వీరు ఆలపించిన గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమాలలో నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, BIACH&RI; జెయస్ ఆర్ ప్రసాధ్, ట్రస్టు బోర్డు సభ్యులు, BIACH&RI; డా. ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI; డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI; డా. ఫణికోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI; డా. కల్పనా రఘునాథ్, మెడికల్ సూపర్నింటెండెంట్, అకడమిక్స్ & యాడ్ లైఫ్, BIACH&RI లతో పాటూ పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది, నర్సింగ్ విద్యార్థి-విద్యార్థిణులు, పారామెడికల్ మరియు ఇతర సిబ్బంది, రోగులు మరియు వారి సహాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here