ప్రాణాలు కాపాడటంలో మీనమేషాలు లెక్కిస్తోన్న జగన్ ప్రభుత్వం

0
121
Vijayawada: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu addresses a press conference, in Vijayawada, on May 5, 2019. (Photo: IANS)
Spread the love

ప్రాణాలు కాపాడటంలో మీనమేషాలు లెక్కిస్తోన్న జగన్ ప్రభుత్వం
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
హైదరాబాద్ మే 5 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: వ్యాక్సినేషన్ విషయంలో జగన్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రజల ప్రాణాలు కాపాడటంలో జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం జూమ్ ద్వారా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వాన్ని విమర్శించడం తమ పని కాదని, కానీ ఆవేదనతోనే మాట్లాడతున్నామని వ్యాఖ్యానించారు.కర్నూలు జిల్లాలో పుట్టిన ఎన్-440 వేరియంట్ ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు అన్నారు. ఏపీ నుంచి వస్తున్న కొత్త స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు కూడా హెచ్చరించిందని గుర్తు చేశారు. బెడ్లు, వెంటిలేటర్ల కొరత లేదని ఏపీ ప్రభుత్వం మాట్లాడుతోందని, ప్రభుత్వ వైఖరితో బాధ కలిగే పొలిట్‌బ్యూరో సమావేశం పెట్టామని తెలిపారు. అతి తీవ్రమైన కరోనాకు కేబినెట్ భేటీలో ప్రాధాన్యత లేదని మండిపడ్డారు.కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని, కరోనా రోగులకు తమ పార్టీ తరపున సాయం అందిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలకు నిషేధాజ్ఞలు అమలవుతున్నాయని, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందని గుర్తు చేశారు. వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా ఉందని, దీనిపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాదని, ఏకంగా ముఖ్యమంత్రే సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. తమ ఆఫీసులో కొందరికి కరోనా వచ్చిందని, అయితే అమెరికా వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించామని చంద్రబాబు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here