ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యార్థుల పాలిట జ‌గ‌న్‌రెడ్డి కంసుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్

0
200
Spread the love

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యార్థుల పాలిట జ‌గ‌న్‌రెడ్డి కంసుడు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
అమరావతి ఏప్రిల్ 28 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యార్థుల పాలిట జ‌గ‌న్‌రెడ్డి కంసుడు అని తేలిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ద‌శ‌లో కేంద్రం, దాదాపు అన్ని రాష్ట్రాలూ ప‌రీక్ష‌లు ర‌ద్దు, వాయిదా వేస్తే, ఒక్క ఏపీలోనేప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని మొండిగా ముందుకెళ్ల‌డం జ‌గ‌న్‌రెడ్డి మూర్ఖ‌త్వానికి నిద‌ర్శ‌నమన్నారు. విద్యార్థుల భ‌విష్య‌త్తు అంటూ దీర్ఘాలు తీస్తున్న జ‌గ‌న్‌రెడ్డి అధ్వాన‌పాల‌న‌లో వారు బ‌తికి ఉంటే క‌దా భ‌విష్య‌త్తు? అని మండిపడ్డారు. అంబులెన్సులు రావని, ఆక్సిజ‌న్ లేదని, జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారని అన్నారు. క‌రోనా శ‌వాల‌తో మార్చురీలు నిండిపోయాయని చెప్పారు. అంత్య‌క్రియ‌ల‌కు శ్మ‌శానాల‌లో క్యూలు ఉన్నాయని, ఆస్ప‌త్రిలో బెడ్డు దొర‌క్క‌ రోడ్డుపైనే కుప్ప‌కూలిపోతున్నారని తెలిపారు.ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా ప‌రీక్ష‌ల పేరుతో 15 ల‌క్ష‌ల‌ మందికి పైగా విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడ‌టం ఫ్యాక్ష‌న్ సీఎంకి త‌గ‌దని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here